Modi Praise Kohli Shami : కోహ్లీ షమీలకు ప్రధాని మోడీ అదిరిపోయే ప్రశంస
Modi Praise Kohli Shami : వరల్డ్ కప్ లో భాగంగా నిన్న జరిగిన సెమీ ఫైనల్ లో భారత్ న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత్ 397 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యచేదనలో న్యూజిలాండ్ కూడా దీటుగానే ఆడింది. బౌలర్ మహమ్మద్ షమీ తనదైన బౌలింగ్ తో కివీస్ ను కట్టడి చేయడంతో మన విజయం ఖాయమైంది.
విరాట్ కోహ్లి సెంచరీ ప్రత్యేకమైనదిగా నిలిచింది. 50 సెంచరీలు చేసి సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డును దాటేశాడు. శ్రేయస్ అయ్యర్ కూడా సెంచరీ చేసి స్కోరును పెంచడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇలా మన బ్యాట్స్ మెన్, బౌలర్ల సమష్టితత్వం భారత్ కు గెలుపు తెచ్చి పెట్టాయి. కోహ్లిని ప్రపంచం మొత్తం అభినందించింది. ఈ మ్యాచ్ లో పలు రికార్డులు బద్దలయ్యాయి.
షమి ఆటను అందరు ప్రశంసించారు. కివీస్ ఆటగాళ్లను ఔట్ చేయడంతో మనకు విజయం సునాయాసంగా నిలిచింది. కోహ్లిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. భారత్ కు మరిన్ని విజయాలు తెచ్చి పెట్టాలని ఆకాంక్షించారు. షమీ బౌలింగ్ కూడా అద్బుతంగా ఉందని కితాబిచ్చారు. అన్ని రంగాల్లో భారత్ చూపిన ఆధిపత్యం మనకు ఎంతో ప్లస్ అయిందని కొనియాడారు.
సెమీస్ లో కివీస్ ను చిత్తు చేసిన భారత్ ఫైనల్ లో అడుగు పెట్టింది. ఈనెల 19న అహ్మదాబాద్ లో ఫైనల్ జరగనుంది. దీనికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫైనల్ లో కూడా భారత్ సత్తా చాటి కప్ గెలవాలని అందరు కోరుతున్నారు. నిన్న జరిగిన సెమీ ఫైనల్ కు ప్రముఖ తెలుగు కథానాయకుడు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.