JAISW News Telugu

PM Modi : లాల్ కృష్ణా అద్వానీకి ‘భారతరత్న’ ఎమోషనల్ అయిన ప్రధాని మోడీ

Prime Minister Modi emotional

Prime Minister Modi emotional

PM Modi – LK Advani : లాల్‌కృష్ణా అద్వానీ గురించి ఇప్పటి జనరేషన్ కొంత పరిచయం అవసరం అయినా.. 90’sకు మాత్రం పరిచయం అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నేతగా సుదీర్ఘ కాలం పని చేశారు. పుట్టింది ఉమ్మడి భారతంలోని పాకిస్తాన్ లో అయినా పెరిగింది. తర్వాత ఆయన కుటుంబం భారత్ కు వచ్చి ఇక్కడే స్థిరపడి పోయింది.

చిన్న తనం నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెరిగిన ఎల్‌కే అద్వానీ. భారతీయ జనసంఘ్ లో చేరాడు. ఆ తర్వాత జనసంఘ్ కాస్తా బీజేపీగా అవతరించింది. అక్కడ వాజపేయి అద్వానీకి తోడయ్యాడు. ఇద్దరూ కలిసి పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చారు. వాజపేయి ప్రధాని అయితే.. ఉప ప్రధానిగా ఎల్ కే అద్వానీ బాధ్యతలు స్వీకరించారు. సుదీర్ఘ కాలం పార్టీకి అధ్యక్షుడిగా కూడా పని చేశారు ఆయన. రాముడికి ఆలయం కట్టాలనే సంకల్పంతో రథయాత్ర చేశారు. ఆయన చేపట్టిన రథయాత్రతోనే బాబ్రీ మసీద్ ను కరసేవకులు కూల్చివేసేందుకు ప్రేరణగా నిలిచింది.

భారత ప్రభుత్వం ఎల్ కే అద్వానీకి భారతరత్నం ప్రకటించింది. దీనిపై ప్రధాని మోడీ ఎమోషనల్ గా స్పందించారు. ‘అద్వానీకి భారతరత్న ప్రదానం చేయడం చాలా సంతోషం’ అని పీఎం మోడీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో రాసుకున్నారు. 96 ఏళ్ల నాయకుడితో ఉన్న రెండు చిత్రాలను ట్యాగ్ చేశారు.

తాను మాజీ ఉప ప్రధాని అద్వానీతో మాట్లాడానని, ఈ గౌరవం లభించినందుకు అభినందనలు తెలిపానని ప్రధాని తెలిపారు.

‘మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞుల్లో ఒకరు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి స్మారకమైనది. అట్టడుగు స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఆయన పయనం స్ఫూర్తి దాయకం’. అని పీఎం రాశారు. అద్వానీ జీ దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో చేసిన సేవలో పారదర్శకత, సమగ్రతపై తిరుగులేని నిబద్ధతతో గుర్తించబడింది. రాజకీయ నైతికతలో ఆదర్శప్రాయమైన ప్రమాణాన్ని కొనసాగించారు.జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ఆయన అసమానమైన కృషి చేశారు’ అని ప్రధాని మోదీ అన్నారు.

ఎల్‌కే అద్వానీ 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేశారు. 1990లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాలకు అధిపతిగా మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు, 1990లో బీజేపీ ఎదుగుదలను రూపొందించిన ఘనత ఆయనది. 2002 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని మంత్రివర్గంలో ఉప ప్రధానిగా పనిచేశారు.

Exit mobile version