Maldives President : ఒక్క కుర్చీతో మాల్దీవుల ఎకానమీని దెబ్బకొట్టిన ప్రధాని నరేంద్ర మోడీని వేడుకునేందుకు ఆ దేశ అధ్యక్షుడు చాలా సార్లు ప్రయత్నించారు. అయితే మాల్దీవుల్లో ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా మొదటి పర్యటన భారత్ లోనే ఉండాలి. కానీ మొయిజు దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటి పర్యటన చైనాకు వెళ్లారు. దీంతో మోడీ లక్షద్వీప్ లో కుర్చీని వేసుకొని కూర్చుకున్నారు. మొయిజు అహం మొత్తం వంచారు.
అయినా కూడా మాల్దీవుల్లో భారత్ చాలా ప్రాజెక్టులు నిర్మించింది. దీనికి తోడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఇప్పటికీ భారత్ ఆదుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలో చిన్న దేశంతో శతృత్వం ఎందుకని మోడీ ఆలోచించారు. ఇక మోడీ ప్రధానిగా మూడో సారి ఎన్నికైన సందర్భంగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజుకు ఆహ్వానం అందింది.
ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మొయిజు ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులతో కలిసి శనివారం (జూన్ 8) న్యూఢిల్లీకి బయల్దేరుతారని ఆ దేశ మీడియా స్పష్టం కథనం వెలువరించింది. మాల్దీవుల అధ్యక్షుడి కార్యాలయం నుంచి మొయిజు భారత పర్యటనకు సంబంధించి అధికారికంగా ధృవీకరణ లేదు.
బుధవారం మోదీని అభినందించిన ముయిజు ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ తో కలిసి పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ‘2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన ప్రధాని @narendramodi, బీజేపీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు అభినందనలు.
‘మా రెండు దేశాలకు భాగస్వామ్య శ్రేయస్సు, స్థిరత్వాన్ని అనుసరించడంలో మా భాగస్వామ్య ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నా’ అని ముయిజు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
President @MMuizzu will attend the swearing-in ceremony of Indian Prime Minister @narendramodi
އިންޑިޔާގެ ބޮޑުވަޒީރު މޯދީ ހުވާ ކުރައްވާ ރަސްމިއްޔާތުގައި ރައީސް މުއިއްޒު ބައިވެރިވެ ވަޑައިގަންނަވާނެ.
Maldives India Friendship 🇲🇻🤝🇮🇳@PMOIndia @presidencymv pic.twitter.com/cH4FvNLJQC
— Maaiz Mahmood (@Maaix4) June 6, 2024
గతేడాది నవంబర్ 17న బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొయిజు భారత్ కు రావడం ఇదే తొలిసారి. తన పూర్వికులలా కాకుండా మొయిజు కొత్త సంప్రదాయానికి తెరలేపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటి పర్యటన తుర్కియేకు, జనవరి, 2024లో మొదటి రాష్ట్ర పర్యటన కోసం చైనా వెళ్లారు.
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే 88 మంది భారత సైనిక సిబ్బందిని తమ దేశం నుంచి వెళ్లిపోవాలని మొయిజు డిమాండ్ చేయడంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ ‘నైబర్ హుడ్ ఫస్ట్’ విధానంలో భాగంగా మాల్దీవులతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్ సహా పొరుగు దేశాల నేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు.