Cheating : ముద్దుకు 50 వేలు, చాట్ డిలీట్ చేస్తే 50 లక్షలు: వ్యాపారిని మోసం చేసిన ప్రీ స్కూల్ నిర్వాహకురాలు అరెస్ట్
Cheating : బెంగుళూరు: ఒక వ్యాపారిని వలలో వేసుకొని రూ. 17 లక్షలు కాజేసిన మరియు చాట్ డిలీట్ చేస్తానని బెదిరించి రూ. 50 లక్షలు డిమాండ్ చేసిన ప్రీ స్కూల్ నిర్వాహకురాలిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగుళూరులోని మహాలక్ష్మి సొసైటీకి చెందిన శ్రీదేవి అనే యువతి ప్రీ స్కూల్ నిర్వహిస్తోంది. 2023లో అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి తన పిల్లలను ఆమె స్కూల్లో చేర్పించాడు. ఈ పరిచయంతో శ్రీదేవి వ్యాపారి వద్ద స్కూల్ ఖర్చుల కోసం రూ. 2 లక్షలు అప్పుగా తీసుకుంది.
ఆ తర్వాత వారి మధ్య స్నేహం బలపడటంతో శ్రీదేవి ఒక ముద్దుకు రూ. 50 వేలు వసూలు చేసేది. అప్పు తిరిగి ఇవ్వమని అడిగిన వ్యాపారికి ఆమె వేరే ప్రతిపాదనలు పెట్టింది. దీంతో విసిగిపోయిన వ్యాపారి లీవ్ ఇన్ రిలేషన్ కు అంగీకరించగా, దాని కోసం శ్రీదేవి రూ. 15 లక్షలు వసూలు చేసింది. ఫిబ్రవరిలో మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో వ్యాపారి ఆమెకు దూరంగా ఉండటం మొదలుపెట్టాడు.
మార్చి 12న శ్రీదేవి వ్యాపారి భార్యకు ఫోన్ చేసి పిల్లల టీసీ కోసం రమ్మనడంతో అక్కడికి వెళ్లిన వ్యాపారిని బీజాపూర్ కు చెందిన రౌడీ షీటర్లు గణేష్ కాలె, సాగర్ బెదిరించారు. రూ. 20 లక్షలు ఇస్తే వదిలేస్తామని చెప్పి రూ. 1.90 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నారు.
మార్చి 17న శ్రీదేవి వ్యాపారికి ఫోన్ చేసి రూ. 50 లక్షలు ఇస్తే చాట్ డిలీట్ చేస్తానని బెదిరించడంతో విసిగిపోయిన వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్రీదేవిని మరియు ఇద్దరు రౌడీ షీటర్లను అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.