Prayers In Shami Village : షమీ గ్రామంలో ప్రార్థనలు.. నీలి సముద్రంగా అహ్మదాబాద్
Prayers In Shami Village : ఈ రోజు ఇండియా మొత్తం క్రికెట్ ఫీవర్ తో ఊగిపోతోంది.. ఎందుకో ఈ పాటికే అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ కప్ మ్యాచ్ ఈ రోజు మన ఇండియాలోనే జరగబోతుంది.. దీంతో 12 ఏళ్ల తర్వాత మన భారత్ ఫైనల్స్ కు వెళ్లడం అనేది అందరికి సంతోషంగా ఉంది.. ఈ సంతోషంతో మ్యాచ్ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మన ఇండియా ఆస్ట్రేలియాతో కలిసి ఆడబోతుంది.. ముందు నుండి అన్ని మ్యాచులు గెలుస్తూ ఫైనల్ కు చేరిన ఇండియా ఈసారి కప్ కొట్టి రావాలని క్రికెట్ అభిమానులే కాదు సాధారణ ఇండియన్ ప్రజలు సైతం కోరుకుంటున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరుగుతుంది.
దీంతో లైవ్ లో మ్యాచ్ ను వీక్షించేందుకు ఇప్పటికే వందల మంది సెలెబ్రిటీలు, లక్షలాది మంది అభిమానులు తరలి వచ్చారు.. అహమ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంకు అభిమానులు పోటెత్తడంతో అక్కడ మొత్తం నీలి సముద్రంగా మారింది.. అభిమానులంతా బ్లూ టీ షర్టులు వేసుకుని అక్కడికి చేరుకున్నారు..
మొత్తంగా స్టేడియంకు లక్ష ముప్పై వేల మంది వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాపై గెలవాలని దేశ వ్యాప్తంగా పూజలు జరుగుతున్నాయి.. భారత్ స్టార్ బౌలర్ షమీ సొంత ఊరులో కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు.