JAISW News Telugu

Prashanth Verma : ప్రశాంత్‌ వర్మకు రూ.1000 కోట్ల ఆఫర్‌? ఇచ్చింది ఎవరో తెలుసా?

Prashanth Verma

Prashanth Verma

Director Prashanth Verma : సినీ ఇండస్ట్రీలో ఎప్పుడో ఒకప్పుడు అద్భుతం జరుగుతుంది. అస్సలు అనుకోని సినిమా కొన్నిసార్లు ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తుంది. చిన్న సినిమాలే అయినా వందల కోట్ల వసూళ్లు సాధించి, మేకర్స్‌ తలరాత మారుస్తుంది. తాజాగా ‘హను-మాన్‌’ టీమ్‌ ఆ అద్భుతాన్ని  సొంతం చేసుకుంది. సంక్రాంతి బరిలో చిన్న చిత్రంగా వచ్చిన ‘హను-మాన్‌’.. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. ఊహించని కలెక్షన్స్‌తో హిస్టరీ క్రియేట్ చేసింది.

రూ. 275 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతుంది. ఈ ఒక్క సినిమా డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ తలరాతను పూర్తిగా మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో చిన్న దర్శకుల లిస్ట్‌లో ఉన్న ప్రశాంత్‌.. ఈ సినిమాతో పాన్‌ ఇండియా డైరెక్టర్‌ గా మారిపోయాడు. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రశాంత్‌కు అడ్వాన్స్‌ ఇచ్చేందుకు ముందుకస్తున్నాయి. తన సినిమాకు వందల కోట్ల బడ్జెటే కాదు.. ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నట్లు ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకచ్చారు.

‘హను-మాన్‌’ తర్వాత రూ.100 కోట్లు, 200 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేసే ఆఫర్లు వచ్చాయి. ఒక దఫాలో రూ. 1000 కోట్ల ఆఫర్‌ కూడా వచ్చింది. హను-మాన్‌ చూసిన ఓ ఎన్నారై ఈ ఆఫర్‌ ఇచ్చాడు. మన ఇతిహాసాలతో సినిమా చేస్తానంటే రూ.1000 కోట్లు పెట్టేందుకు నేను రెడీ అని హామీ ఇచ్చారు. ఇక్కడ బడ్జెటే ముఖ్యం కాదు. పెట్టిన డబ్బుకు మించిన క్వాలిటీ చూపించామా? లేదా? అనేదే ముఖ్యం. చెప్పిన బడ్జెట్‌లో సినిమా తీసే డైరెక్టర్‌ను కాదు. ఈ విషయం హను-మాన్ మొదట్లోనే నిర్మాతలకు చెప్తాను.

నేను రూ. 10 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే.. దాన్ని రూ. 50 కోట్ల సినిమాలా చూపిస్తా. రూ. 40 కోట్లతో తీస్తే.. దాన్ని రూ.150 కోట్ల సినిమాగా చూపిస్తా. మార్కెట్‌ను అంచనా వేసుకొని సినిమా చేస్తా’ అంటూ ప్రశాంత్ వర్మ చెప్పారు. రూ.1000 కోట్ల ఆఫర్‌ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రాజమౌళికి కూడా రాలేదు. ఒక్క సినిమాతోనే ప్రశాంత్‌ వర్మకు ఇంత పెద్ద ఆఫర్‌ రావడం గొప్ప విషయమే. ఒక వేళ ప్రశాంత్‌ వర్మ అంత పెద్ద బడ్జెట్‌తో సినిమా చేస్తే.. అది రూ.2000 కోట్లు వసూలు చేస్తుందని నెటిజన్స్‌ అభిప్రాయ పడుతున్నారు.

Exit mobile version