Prashanth Neel : 1200 కోట్ల నుంచి 30 కోట్లకు పడిపోయిన ప్రశాంత్ నీల్ గ్రాఫ్.. కారణం ఆ మూవీనే..
Prashanth Neel : కన్నడ దర్శకుడు, కాదు.. కాదు.. పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి చెప్పక్కర్లేదు. ‘ఉగ్రమ్’ సినిమాతో డైరెక్టర్ గా మారిన ఆయన కెరీర్ లో భారీ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, ఫిలింఫేర్, సైమా లాంటి పెద్ద పెద్ద అవార్డులు ఉన్నాయి. ఆయన కెరిర్ లో ఉగ్రమ్ కంటే ఎక్కువ క్రేజ్ కేజీఎఫ్ కు దక్కింది. ఇది వరల్డ్ వైడ్ గా రికార్డుల వర్షం కురిపించింది. ఆ తర్వాత సలార్ తో ప్రభాస్ హీరోగా కలిసి చేసిన సలార్: సీజ్ ఫైర్ కూడా బాగానే ఆడింది. సలర్2: శౌర్యాంగ పర్వంను తెరకెక్కించే బిజీలో ఉన్నారు ప్రశాంత్ మామ.
ఈ గ్యాప్ లో ఆయన ఒక సినిమాకు రచయితగా పని చేశారు. కన్నడ చిత్రం బఘీరకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. తన బ్రాండ్ నేమ్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్రచారం చేశారు. ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా రూ. 30 కోట్ల లోపు కలెక్షన్లతో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంటోంది. ఇందులో 99 శాతం కలెక్షన్లు ఒక్క కన్నడ మార్కెట్ నుంచే వచ్చాయి. అంటే పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేసినా ఎవరూ ఆదరించలేదు. తర్వాతి రోజుల్లో కొంత ఊపందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారం మొత్తం రూ. 22 కోట్లు సాధించింది. దాదాపు రూ.7 కోట్లు అదనంగా రాబట్టిన ఈ చిత్రం రెండో వారంలో కూడా జోరును కొనసాగించలేకపోయింది.
శివ రాజ్ కుమార్ నటించిన భైరథి రణగల్ విడుదల నేటి నుంచి బాఘీరా బాక్సాఫీస్ రన్ ను మరింత దెబ్బతీస్తుంది. కేవలం కోటి ఓవర్సీస్ గ్రాస్ తో కలిపి వరల్డ్ వైడ్ గా రూ. 30 కోట్ల గ్రాస్ తో ఈ సినిమా తన జర్నీని ముగించే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ వరల్డ్ వైడ్ గా 1200 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, బఘీరా 30 కోట్లతో ముగుస్తుంది. ప్రశాంత్ నీల్ బ్రాండ్ వాల్యూ బఘీరాకు వర్కవుట్ కాలేదు.