Bigg Boss Eviction Pass : ప్రశాంత్ – గౌతమ్ పంచె గొడవ పీక్స్.. నామినేషన్స్ లో ఉంది వీరే.. ఎవిక్షన్ పాస్ రైతు బిడ్డకే..
Bigg Boss Eviction Pass : బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగుతుంది.. ఈ సీజన్ ఇప్పటికే 11 వారాలు పూర్తీ చేసుకుని 12వ వారంలోకి అడుగు పెట్టింది.. ఇక ప్రస్తుతం హౌస్ లో నామినేషన్స్ రచ్చ జరుగుతుంది.. ఆదివారం ఎపిసోడ్ లోనే నాగ్ ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగ్ చెప్పడంతో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక 12వ వారంలో నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది.. ఈసారి నామినేషన్స్ లో అమర్ దీప్ యావర్, రతిక లను నామినేట్ చేయగా గౌతమ్ ప్రశాంత్, శివాజీ లను నామినేట్ చేసాడు.. రతిక ప్రశాంత్, అమర్ దీప్ లను నామినేట్ చేయగా అర్జున్ యావర్, శివాజీలను నామినేట్ చేసాడు..
ఇక పల్లవి ప్రశాంత్ గౌతమ్, రతికలను నామినేట్ చేయగా అశ్విని మాత్రం తనని తాను నామినేట్ చేసుకుని పిచ్చి పని చేసింది. ఎవరు ఈమెను నామినేట్ చేయక పోయిన తనని తాను నామినేట్ చేసుకుని సిల్లీ పని చేసింది. రతికా ఈసారి అమర్ దీప్, ప్రశాంత్ తో గొడవ పెట్టుకుంది.. ఈ ఇద్దరితో ఆసక్తికర వాదన సాగగా మేము మారము మా లాగనే ఉంటాం అంటూ స్పష్టం చేసారు.
ఇక ఆ తర్వాత ప్రశాంతం గౌతమ్ మధ్య పంచె గొడవ పీక్స్ కు చేరుకుంది. గౌతమ్ పంచె ప్రస్తావన తీసుకువచ్చాడు.. దీంతో ప్రశాంత్ పంచె ఊడకుండా చూసుకో అంటూ చెప్పడంతో గౌతమ్ ఆవేశంతో ఊగిపోయాడు. ఇద్దరి మధ్య భారీ రచ్చ జరిగింది.
ఇక ఫైనల్ గా శివాజీ, రతికా రోజ్, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, యావర్, అశ్విని, గౌతమ్, అర్జున్ ఈ వారం నామినేట్ అయినట్టు తెలుస్తుంది.. అలాగే యావర్ ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేయడంతో మళ్ళీ టాస్క్ పెట్టగ ఈసారి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్ అయ్యి ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ వారం ఇతడు నామినేషన్స్ లో ఉన్న సేవ్ అయ్యినట్టే అని చెప్పాలి.