Prashant Kishore : కొత్త రాజకీయ పార్టీని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. ‘జన్ సురాజ్’ పార్టీని బుధవారం వెల్లడించారు. ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ తమ పార్టీ గత రెండేళ్లుగా క్రియాశీలకంగా ఉందని, ఎన్నికల సంఘం నుంచి కూడా ఆమోదం పొందినట్లు తెలిపారు. బీహార్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ బీహార్ లో 30 ఏళ్లుగా ఆర్జేడీ, జేడీయూ, బీజేపీలకే ఓట్లు వేస్తున్నారని, ఆ సంప్రదాయం అంతం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ పార్టీ రాజ వంశానికి చెందినది కాదని తెలిపారు. జన్ సురాజ్ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించినట్లు తెలిపారు. బీజేపీతో కలిసి పని చేసేందుకు పార్టీ ఏర్పాటు చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఇక మద్యపాన నిషేధాన్ని రద్దు చేస్తామని చెప్పారు. అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తోందని స్పష్టం చేశారు. పార్టీకి ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ అధికారి మనోజ్ భారతి నేతృత్వం వహిస్తారని వెల్లడించారు.