Prasanth Kishore Comments : ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ తెలుగు టీవీ ఇంటర్వ్యూ లో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో విజయాన్ని సొంతం చేసుకున్న జగన్‌కు.. ఈ సారి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవుతుందన్నారు. ఇది తన అంచనా అని చెప్పారు. అయితే, జగన్‌కి, తనకు మధ్య గొడవ జరిగిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. జగన్ తనకు స్నేహితుడని.. ఇద్దరి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పారు. తొలి నుంచి ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్న ప్రశాంత్ కిశోర్.. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఏపీకే రాలేదని.. ఎలా వివాదం ఏర్పడుతుందని ప్రశ్నించారు.
ఏడాదిన్నర కిందట ఢిల్లీలో కలిశామని.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోబోతున్నారని జగన్‌కు చెప్పానన్నారు. తన మాటలను అంగీకరించలేదని.. ఆ రోజు మాట్లాడిన ప్రకారం.. తమకు ఏపీలో తిరుగులేదని జగన్ భావిస్తున్నారన్నారు. మళ్లీ 155 సీట్లు గెలిస్తామనే ధీమా వ్యక్తం చేశారని.. అదే జరిగితే మంచిదే కదా? అన్నానని చెప్పారు. ఎన్నికల్లో జగన్ ఓడిపోయేందుకు చాలానే కారణాలున్నాయని.. కేవలం ఒకే తప్పు కాదన్నారు. ఎన్నికల్ల గెలుపు తర్వాత తప్పు మీద తప్పు చేస్తూ వెళ్లాడని.. తాను ఇచ్చేవాడని భావించుకున్నానడ్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నేతలనే ఎన్నుకుంటారని.. రాజులను కాదన్నారు. కొందరు తమను తాము రాజులుగా భావిస్తుంటారన్నారు. ప్రజలకు ఏమీ అవసరం లేదు ఖాతాల్లోనే డబ్బులు వేస్తే సరిపోతుందని జగన్ భావించినట్లుగా ప్రశాంత్ కిశోర్ తెలిపారు.
అలాగే జగన్ కుటుంబ వివాదాలను కూడా ప్రజలు గమనిస్తున్నారన్నారు. తల్లి, చెల్లి నమ్మనివాడిని ప్రజలు ఎలా నమ్ముతారు…?? తల్లి, చెల్లి చేత కూడా… ఎవరైనా డబ్బులిచ్చి మాట్లాడిస్తున్నారా…?? 2019 ఎన్నికల్లో షర్మిల తన అన్న జగన్ కోసం ఎంతో కష్టపడ్డారన్నారు. 2019లో జగన్ ఎక్కడి నుంచి మొదలుపెట్టాడో మళ్లీ అక్కడికే చేరుతాడన్నారు. 151 నుంచి 51కి వైసీపి పడిపోబోతోందన్నారు. అతడి చుట్టూ ఉన్న బేవకూఫ్‌ల మాటలు వినడమే ఇందుకు కారణమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బొత్స ఎవరితో ఉంటే… వారిని మోసం చేశాడన్నారు. ఎన్నికలు అయ్యాక టీడీపీలోకి వెళ్లడానికి బొత్స ప్లాన్ చేశాడన్నారు. ఇలా జగన్ రెడ్డి ఓడిపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని చెప్పారు.