JAISW News Telugu

Prasant Neel:స‌లార్ డైరెక్ట‌ర్ డార్క్ OCD మాన‌సిక స్థితి?

Prasant neel:ప్ర‌శాంత్ నీల్ స‌లార్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని ఆస్వాధిస్తున్నాడు. కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2 చిత్రాల‌తో అసాధార‌ణ విజ‌యాలు అందుకున్న అత‌డు స‌లార్ తో హ్యాట్రిక్ విజయం అందుకున్నాడు. ఇదే హుషారులో ప‌లు ఇంట‌ర్వ్యూల్లో ప్ర‌శాంత్ నీల్ త‌న‌కు ఉన్న డార్క్ ఓసిడి స‌మ‌స్య గురించి ప్ర‌స్థావించాడు.

కేజీఎఫ్ ఫ్రాంఛైజీ చిత్రాలు కానీ, స‌లార్ కానీ డార్క్ థీమ్ తోనే ఎందుకు తెర‌కెక్కించారు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా త‌న మాన‌సిక స్థితి డార్క్ ఓసిడికి క‌నెక్ట‌యి ఉంద‌ని తెలిపాడు. ఓసిడి అంటే అబ్సెస్సివ్ కంప‌ల్సివ్ డిజార్డ‌ర్. దీన‌ర్థం.. ఫ‌లానా విష‌యం ఇలానే ఉండాలి అని దానికే అతుక్కుని ఉండ‌డం. ఈ విష‌యంలో తాను మార‌లేక‌పోయాన‌ని ప్ర‌శాంత్ నీల్ అన్నాడు.

అయితే డార్క్ థీమ్ అనేది అత‌డి యూనిక్ క్వాలిటీగా తెర‌పై వ‌ర్క‌వుటైంది. కేజీఎఫ్ సినిమాల్ని డార్క్ థీమ్ తో తీయ‌డ‌మే ప్ర‌ధాన అస్సెట్ అయింది. మాఫియా క‌థ‌ల్ని అలా తీయ‌డ‌మే కరెక్ట్ అని కూడా అత‌డు అంగీక‌రించాడు. తాను చేస్తున్న‌ది స‌రైన‌దేన‌నిపించింద‌ని, ఇత‌రుల సూచ‌న‌ల‌ను ప‌ట్టించుకోన‌ని అన్నాడు. కేజీఎఫ్ థీమ్ కి స‌లార్ థీమ్ కి ఉన్న క‌నెక్ష‌న్ గురించి మాట్లాడుతూ.. కనెక్ష‌న్ ఉన్నా కానీ, త‌న ఎంపిక స‌రైన‌దేన‌ని ప్ర‌శాంత్ నీల్ స‌మ‌ర్థించుకున్నాడు.

కేజీఎఫ్ కి కొన‌సాగింపుగా స‌లార్ తీసాడ‌ని విమర్శిస్తున్న వారికి త‌న సినిమాల్లో భావోద్వేగాలు, యాక్ష‌న్ డ్రామా దీనికి కార‌ణ‌మ‌ని, సినిమా టోన్ నేప‌థ్యం డార్క్ థీమ్ కావ‌డం వ‌ల్ల అలా అనిపించి ఉంటుంద‌ని కూడా ప్ర‌శాంత్ నీల్ అన్నాడు. భువ‌న‌గౌడ కెమెరా వ‌ర్క్ కూడా దీనికి ఒక కార‌ణ‌మ‌ని, అత‌డు గ్రేప్యాలెట్ డిజైన్ చేసి సినిమాకి స‌హ‌కరించాడ‌ని తెలిపాడు.

Exit mobile version