Prajwal Revanna : బెంగళూరులో ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టు

Prajwal Revanna
Prajwal Revanna : లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను భారీ భద్రత మధ్య విచారణ కోసం సీఐడీ కార్యాలయానికి తరలించారు.
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ ఎన్డీయే కూటమి తరపున హాసన నుంచి ఎంపీగా పోటీ చేశారు. పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయన గత ఏప్రిల్ లో దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటి వరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదయ్యాయి. ఆయన జాడ కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆయనపై నాలుగు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్ పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ప్రజ్వల్ తండ్రి హెచ్ డీ రేవణ్ణ, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి, మాజీ పీఎం హెచ్ డీ దేవెగౌడ బంహిరంగంగానే కోరారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని, మే 31న ‘సిట్’ ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారి వీడియో సందేశంలో రేవణ్ణ తెలిపారు.