Prajapalana Applications :దరఖాస్తు చేసుకోగానే స్కీమ్‌లు రావని..నిజమైన అర్హుల కోసం మరోసారి ఇంటింటి సర్వే నిర్వహి స్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపా రు. కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై రోజుకో ప్రకటనతో గందరగోళం నెలకొంది. ఇప్పటికే 5 గ్యారంటీల కోసం వ్యయ, ప్రయాసలకోర్చి ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వ సిబ్బంది దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని.. తర్వాతే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పొంగులేటి తెలిపారు. అర్హుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక పథకాలకు సంబంధించి గైడ్‌లైన్స్ విడుదలైన తర్వాత ఒక్కో స్కీమ్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం వంద రోజుల్లో హామీలు అమలు చేస్తా మని చెప్తున్నప్పటికీ.. ప్రస్తుతం జరుగుతున్న తీరు చూస్తే ఇప్పట్లో స్కీమ్‌ల అమలుపై అధికారు ల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రజా పాలన కార్యక్రమంలో సమర్పించిన దరఖా స్తుల ను ఆన్‌లైన్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 17లోగా డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.