Prabhas : సోషల్ మీడియాలో ప్రభాస్ ఒక్క పోస్టు.. ఆ సర్ ప్రైజ్ ఇదేరా బాబు
Prabhas : డార్లింగ్స్ సర్ ఫ్రైజ్ అంటూ ఇన్ స్టా లో ప్రభాస్ పెట్టిన పోస్టుతో సోషల్ మీడియా ఊగిపోతుంది. త్వరలోనే సర్ ప్రైజ్ అంటూ ఫ్యామిలీ మెంబర్ ను పరిచయం చేస్తానని చెప్పాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు చాలా మంది ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ పెళ్లి విషయమే ప్రకటించబోతున్నాడని డిసైడ్ అయిపోయారు. ప్రభాస్ పెట్టిన పోస్టు వెనక మరో అర్థం ఉందని మరికొందరు అంటున్నారు.
జూన్ 27న ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ కానుంది. హిరోయిన్ గా కల్కి మూవీలో దీపికా పదుకొనే నటించిందని ఆమెను త్వరలోనే పరిచయం చేస్తానని చెప్పేందుకే ఈ పోస్టు చేశాడని కొందరు అంటున్నారు. దీపికా పదుకొనే కల్కి సినిమా ఎంట్రీ టీజర్ ను త్వరలోనే అని చెప్పేందుకే ప్రభాస్ ఇలాంటి పోస్టు చేశాడని అనుకుంటున్నారు. కల్కి మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ప్రభాస్ నటిస్తున్నట్లు ఇప్పటికే రివీల్ చేశారు.
అయితే కల్కి మూవీలో హిరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తుందని ఆ సర్ ప్రైజ్ చెప్పేందుకే ఇలా ప్రభాస్ పోస్టు చేశాడని కొంతమంది భావిస్తున్నారు. కల్కి మూవీలో కమల్ హాసన్ క్యారెక్టర్ ను కూడా రిలీవ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 27 న రిలీజ్ కానున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి.
కల్కి మూవీని మే 9 న రిలీజ్ చేస్తామని మొదట్లో ప్రకటించినా సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి. దీంతో వాటిని కంప్లీట్ చేసి మిగతా సినిమాలు ఏవీ పోటీ లేకుండా చూసుకుని విడుదల చేసేందుకు కల్కి టీం సిద్ధమైంది. కల్కి సినిమాతో ప్రభాస్ మళ్లీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కల్కి సినిమా గురించి అప్ డేట్ ఇవ్వాలని చూసిన ప్రభాస్ కు ఆయన చేసిన పోస్టును తప్పుగా అర్థం చేసుకున్న ఫ్యాన్స్ ప్రభాస్ పెళ్లి అని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.