JAISW News Telugu

Prabhas Wedding : ఏప్రిల్ 21 వ తారీఖున ప్రభాస్ పెళ్లి ఫిక్స్..పెళ్లి కూతురు ఎవరో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Prabhas wedding fixed on April 21.

Prabhas wedding fixed in April

Prabhas Wedding : టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మొదటి స్థానం లో నిలబడతాడు. పెద్దనాన్న కృష్ణం రాజు కి మూడు కోరికలు ఉండేవి. ఒకటి ప్రభాస్ పెద్ద పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అవ్వాలని అనుకున్నాడు, ఆయన అనుకున్న దానికంటే ఎక్కువే అయ్యాడు. ఇక రెండవది తన చేతుల మీదుగా ప్రభాస్ పెళ్లి జరిపించాలని అనుకున్నాడు.

కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన దురదృష్టం కొద్దీ తిరిగిరాని లోకాలకు పయనం అయ్యాడు. ఇక మూడవ కోరిక రెండవది పూర్తి అయితేనే కదా జరిగేది. అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక శుభ వార్త సోషల్ మీడియా లో తెగ ప్రచారం సాగుతుంది. అదేమిటంటే ప్రభాస్ పెద్దమ్మ శ్యామల తనకి తెలిసిన ఒక మంచి కుటుంబానికి చెందిన పద్దతి గల అమ్మాయిని సెలెక్ట్ చేసి ప్రభాస్ కి చూపించింది అట. ప్రభాస్ కి కూడా ఆ అమ్మాయి తెగ నాచేయడం తో వెంటనే ఓకే చెప్పేసాడు .

ఇప్పుడు ప్రభాస్ నిశ్చితార్థం మార్చి 17 వ తారీఖున చేసి, ఏప్రిల్ 21 వ తారీఖున పెళ్లి చెయ్యాలని ఇంట్లో నిశ్చయం అయ్యిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. అతి త్వరలోనే ప్రభాస్ స్వయంగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఈ శుభవార్తని అభిమానులతో పంచుకోబోతున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా నిన్న మొన్నటి వరకు ప్రభాస్ కృతి సనన్ తో ప్రేమలో ఉన్నాడని, వీళ్లిద్దరు డేటింగ్ కూడా చేస్తున్నారని, మాల్దీవ్స్ లో ఎవరికీ తెలియకుండా నిశ్చితార్థం కూడా చేసేసుకున్నారు అంటూ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారమైన సంగతి అందరికీ తెలిసిందే. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్’ షో లో కూడా ఈ విషయం పై బాలయ్య తెగ ఆటపట్టిస్తాడు కూడా.

బయట ఈవెంట్స్ లో కూడా ప్రభాస్, కృతి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ని చూసి అభిమానులు సైతం కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో ఉందని అనుకున్నారు. జంట చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంది, ఒక్కటైతే బాగుండును అని ఆశపడ్డారు. కానీ ఆ ఆశలన్నీ ఆవిరి ఐపోయినట్టే ఇక. గతం లో అనుష్క, కాజల్ అగర్వాల్ వంటి వాళ్ళతో కూడా   కూడా ప్రభాస్ ప్రేమాయణం నడిపాడని వార్తలు వచ్చాయి.

Exit mobile version