JAISW News Telugu

Star Heroes : మొన్న ప్రభాస్.. నేడు ఎన్టీఆర్.. స్టార్ హీరోల సినిమాలపై వరాల జల్లు

Star Heroes

Star Heroes Movies

Star heroes : తెలుగు సినిమా రోజురోజుకూ తన పరిధిని పెంచుకుంటూ పోతున్నది.  2015లో వచ్చిన బాహుబలి సినిమాతో ప్రాంతీయ భేదాలు వీడుతున్నాయి. ఒక్కో హీరో, నిర్మాత కాస్త ధైర్యం చేసి ఇతర భాషల్లోనూ తెలుగు సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మార్కెట్ పరిధి కూడా పెరుగతున్నది. ఇందుకు బన్నీ పుష్ప, తేజా సజ్జా హను-మాన్ చిత్రాలు మరింత ఊపిపోశాయి. ఇక ఎలాగూ ప్రభాస్ అన్ని ప్రాజెక్టులు పాన్ ఇండియాలో రూపొందుతున్నాయి.

గతంలో పెద్ద సినిమాలు విడుదల అయితే మూవీ ఎలా ఉంది..? హీరో ఎలా చేశాడు.. దర్శకుడు ఎలా తీశాడ అని అడిగేవాళ్లు. కానీ ఇప్పుడ పరిస్థితులు మారాయి. ఓ పెద్ద హీరో సినిమా వస్తున్నదంటే టికెట్ రేట్లు ఎంత వరకు పెంచారు.? ఒక్కో టికెట్‌పై ఏ రేంజ్ దాకా హైక్ ఇచ్చారు అని అడుగుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ దేవర విషయంలోనూ  ఇదే జరిగింది. మరి ఈ సినిమాకు టికెట్ రేట్లు ఎంత దాకా పెరగబోతున్నాయి..? ప్రస్తుతం పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే రెండు తెలుగు ప్రభుత్వాలు నిర్మాతలకు తీపికబురు అందిస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం  దేవర చిత్రంపై వరాల జల్లు కురిపించింది. టికెట్ రేట్లు భారీగా పెంచుకునే వెసలుబాటు ఇచ్చింది. లోయర్ క్లాస్ రూ. 60, అప్పర్ క్లాస్ రూ. 110,  మల్టీప్లెక్స్‌లో రూ. 135 దాకా పెంచుకునే వెసులు బాటు ఇచ్చారు.

విడుదలకు ముందు రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచే షోలు ప్రద్శరించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మొదటి రోజు 6 షోలు.. రెండో రోజు నుంచి 10వ రోజు దాకా 5 షోలకు అనుమతి ఇచ్చింది.

పెరిగిన టికెట్ రేట్లు రెండు వారాల పాటు కొనసాగుతాయి. ప్రభాస్ కల్కి సినిమాపైనా ఇలాగే వరాల జల్లు కురిసింది. అశ్వినీదత్ ప్రొడక్షన్ లో వచ్చిన కల్కి సినిమాకు టికెట్ రేట్లు భారీగానే పెంచేశారు.  ఆ పెరిగిన టికెట్ ధరల ప్రభావం కలెక్షన్లలో కనిపించింది. కల్కి ఏకంగా రూ. వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఇక దేవర సైతం పాన్ ఇండియా స్తాయిలో విడుదల చేయబోతున్నారు. ఇక రాబోయే గేమ్ ఛేంజర్, పుష్ప 2, విశ్వంభర  పెద్ద లాంటి సినిమాలకు సైతం టికెట్ రేట్ల పెంపు విషయంలో నిర్మాతలకు ఇబ్బందులు ఉండకపోవచ్చు.

Exit mobile version