Prabhas surgery : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చాలా కాలం నుండి మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది మనకి ఆదిపురుష్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో ప్రభాస్ పాల్గొన్నప్పుడు తెలిసింది. నడవడానికి ఎంతో ఇబ్బంది పడుతూ, హీరోయిన్ కృతి సనన్ సహాయం తీసుకొని నడుస్తూ, ఏమైంది మా ప్రభాస్ కి ఇలా నడుస్తున్నాడు అని అభిమానులు ఫీల్ అయ్యారు.
అప్పటి వరకు కేవలం సర్జరీ గురించి విని తెలుసుకున్న ఫ్యాన్స్, స్వయంగా తమ హీరో ఇబ్బందిని చూసి చలించిపోయారు. ఆ మోకాళ్ళ నొప్పితోనే ప్రభాస్ ఆదిపురుష్, సలార్ చిత్రాలను పూర్తి చేసాడు. ‘కల్కి’ చిత్రాన్ని కూడా అదే మోకాళ్ళ నొప్పితో సగభాగానికి పైగా షూటింగ్ ని చేసాడు. ఇప్పటికీ ఇలాగే కొనసాగిస్తే ప్రభాస్ మోకాళ్ళు శాశ్వతంగా పని చెయ్యకపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పడం తో కొంతకాలం ‘కల్కి’ మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. ‘కల్కి’ తో పాటుగా ఆయన డైరెక్టర్ మారుతీ తో కలిసి ‘రాజా సాబ్’ అనే చిత్రం కూడా చేస్తున్నాడు.
ఇది ఇలా ఉండగా ఇప్పుడు ప్రభాస్ మళ్ళీ విదేశీ ప్రయాణం చెయ్యబోతున్నాడు. మొన్నీమధ్యనే మోకాళ్ళ సర్జరీ చేయించుకొని వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్, ఇప్పుడు ఇంతలోపే విదేశాలకు ఎందుకు వెళ్తున్నాడు, మళ్ళీ సర్జరీ చేయించుకోడానికి వెళ్తున్నాడా అంటే అవుననే అంటున్నాయి ప్రభాస్ సన్నిహిత వర్గాలు. ఇప్పటికే ప్రభాస్ షూటింగ్ లో పాల్గొని చాలా రోజులు అయ్యింది. కల్కి సినిమా విడుదల తేదీ ని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించేసారు. మే 9 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన కూడా చేసారు . దీంతో ప్రభాస్ షూటింగ్ చెయ్యాల్సిన పార్ట్ కొంత మిగిలి ఉంది, కాబట్టి తప్పక షూటింగ్ చెయ్యాల్సిన పరిస్థితి, ఎందుకంటే కమల్ హాసన్ డేట్స్ కూడా ఇచ్చేసాడు. ఈ డేట్స్ దాటిపోతే మళ్ళీ కమల్ హాసన్ మరో ఏడాది వరకు దొరకడు, అందుకే షూటింగ్ ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడట ప్రభాస్.
అందుకే తుది సర్జరీ కి సంబంధించి విదేశీ డాక్టర్లను సంప్రదించగా, ఒకసారి చెకప్ చేసి చెప్తాము, చివరి సర్జరీ కి అనుకూలంగా మీ మోకాళ్ళు సహరిస్తే సర్జరీ వెంటనే చేసి పంపిస్తాము, లేదంటే కొన్ని రోజులు ఆగాల్సిందే, ఒక్కసారి హాస్పిటల్ కి రండి అని పిలవడంతో ప్రభాస్ మళ్ళీ విదేశీ పర్యటనకి బయలుదేరుతున్నట్టు సమాచారం.