Prabhas : ప్రభాస్ ఎక్కడా కూడా మూడు నిమిషాలకు మించి మాట్లాడడు.. ఎందుకో తెలుసా..
Prabhas : ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్. బాహుబలితో తెలుగుతోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. బాహుబలి 2, సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ లాంటి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. ప్రభాస్ నుంచి ఏ చిత్రం వచ్చినా అది ఇప్పుడు పాన్ ఇండియా మూవీనే. అంతలా స్టార్ గా మారిపోయారు.
ప్రభాస్ తన కెరీర్ స్టార్టింగ్ లో ఈశ్వర్ సినిమాతో తెలుగులో అరంగ్రేటం చేశాడు. ఆ సమయంలో నన్ను ఎవరూ చూస్తారని అనుకున్నడంటా.. కానీ ఈశ్వర్ సినిమాలో ఆయన చేసిన నటనకు మంచి గుర్తింపు లభించింది. మొదటి సినిమాతోనే తన లోని నటనను బయటకు తీసిన ప్రభాస్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. రాఘవేంద్ర మూవీ కాస్త నిరాశ మిగిల్చిన ఆ తర్వాత వచ్చిన వర్షం మూవీ తెలుగు ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.
వర్షం సినిమా ద్వారా ప్రభాస్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఛత్రపతి, డార్లింగ్ లాంటి బ్లాక్ బ్లస్టర్ మూవీలతో బంపర్ హిట్ లు కొట్టాడు. తర్వాత బాహుబలి ప్రభాస్ కెరీర్ నే మార్చేసింది. పాన్ ఇండియా హిరోగా మారి అగ్ర హిరోగా శాసిస్తున్నాడు. తెలుగులో అగ్ర హిరో గా నటించిన కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ప్రభాస్ ఎక్కువ మాట్లాడడు. ఎక్కువ మంది ఉన్నప్పుడు చాలా భయపడతాడు.
ప్రభాస్ ఎక్కడైనా మూడు నిమిషాలకు మించి మాట్లాడడు. అదే అతడి ఆయుధంగా పనిచేస్తుందంటా.. కొంతమంది ఇంట్రోవర్ట్ అంటే మరి కొందరు బిడియం సిగ్గు అంటారు. కానీ ప్రభాస్ తక్కువ మాట్లాడడమే విజయ సోపానంగా మార్చుకున్నారు. ఓపిక, క్రమశిక్షణ తన పెదనాన్న నుంచే నేర్చుకుని ముందుకు సాగుతున్నారు. ప్రభాస్ తన చిరునవ్వుతో ఎంతటి వారినైనా ఇట్టే పడేస్తాడని తనకు ఎక్కువ దగ్గరున్న వాళ్లు చెబుతుంటారు. అందుకే ప్రభాస్ డార్లింగ్ గా మారిపోయాడు. తెలుగుతో పాటు.. పాన్ ఇండియాలోనే సూపర్ స్టార్ గా మారిపోయి అలరిస్తున్నాడు.