Kannappa Movie : రెబల్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అయ్యారు ప్రభాస్. బాహుబలితో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. రిజల్ట్ ఎలా ఉన్నా సినిమా సినిమాకి తన మార్కెట్ ను విస్తరించుకుంటున్నాడు. ఫలితం ఎలా ఉన్నా కనీసం రూ 300 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తున్నాయి ప్రభాస్ సినిమాలు. ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం ప్రభాస్ మరో మూడేళ్ల వరకు డేట్స్ ఖాళీగా లేవు. ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు బడా బడా నిర్మాతలు, ప్రొడక్షన్ కంపెనీలు ఖాళీ చెక్కులతో వెయిట్ చేస్తున్నాయి. కుదరకుంటే డిస్ర్టిబ్యూషన్ చేసే అవకాశమైనా ఇవ్వాలని ప్రాధేయ పడుతున్నాయి. ప్రస్తుతం అది ప్రభాస్ రేంజ్.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్పలో భాగం కానున్నాడు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు 48 ఏళ్ల క్రితం భక్త కన్నప్ప సినిమాతో సెన్సేషనల్ హిట్ సాధించాడు. ఈ సినిమా కృష్ణంరాజు కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచింది. ఒకే కథతో తెలుగులో ఎన్నో సినిమాలు మళ్లీ రూపుదిద్దుకున్నాయి. కానీ భక్త కన్నప్ప కథతో మరెవరూ సినిమా చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. అంతగా భక్త కన్నప్ప క్యారెక్టర్ లో జీవించాడు రెబల్ స్టార్ కృష్ణంరాజు.
ఇప్పుడు అదే కథతో కన్నప్ప..
దాదాపు 48 ఏళ్ల తర్వాత భక్త కన్నప్ప కథతో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప సినిమా రూపొందిస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాడు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తయ్యింది.
ఈ సిసిమాలో కీలక పాత్రకు ప్రభాస్ ను ఒప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రెబల్ స్టార్ భాగం కానున్నాడు. అయితే శివుడి క్యారెక్టర్ లో ప్రభాస్ కనిపిస్తారని ఫిలింనగర్ నుంచి టాక్ వినిపించింది. కానీ ప్రభాస్ శివుడి క్యారెక్టర్ చేయడం లేదని తెలుస్తున్నది. రెబల్ స్టార్ నందీశ్వరుడిగా కనిపించబోతున్నాడని టాక్. శివుడి పాత్రను తాను చేయదల్చుకోలేదని విష్ణును కన్విన్స్ చేశాడట ప్రభాస్. ఇచ్చిన మాట ప్రకారం విష్ణు అడిగిన క్యారెక్టర్ కాకపోయినా నందీశ్వరుడిగా కనిపించడానికి ప్రభాస్ ముందుకు వచ్చాడని తెలుస్తున్నది.