Prabhas : నెట్ ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్..?

Prabhas gave green signal to do web series

Prabhas gave green signal to do web series

Prabhas : ఈమధ్య కాలంలో ఓటీటీ యాప్స్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. కరోనా వచ్చిన లాక్ డౌన్ సమయం లో జనాలకు ఇది ఒక అలవాటుగా మారిపోయింది. దీని ప్రభావం వల్ల థియేటర్స్ కొద్దినెలల చాలా సమస్యలను ఎదురుకోవాల్సి వచ్చింది. అకస్మాత్తుగా జనాలు థియేటర్స్ కి రావడం తగ్గిపోవడం తో థియేటర్స్ ఇలాగే కొనసాగితే మూతపడిపోతాయేమో అనేంత దీనమైన స్థితికి వచ్చేసింది.

ఆ తర్వాత కొన్ని చర్చల ద్వారా చిన్న చిన్న మార్పులకు ఓటీటీ సంస్థలు ఫిల్మ్ మేకర్స్ తో ఏకాభిప్రాయానికి రావడం తో ఇప్పుడు మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. కానీ ఇప్పటికీ ఓటీటీ లో వచ్చే వెబ్ సిరీస్/ సినిమా లకు ఏ మాత్రం కూడా డిమాండ్ తగ్గలేదు. కొంతమంది హీరోలు ఓటీటీ కోసం ఎక్సక్లూసివ్ గా పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు. రీసెంట్ గానే నాగ చైతన్య హీరో గా నటించిన ‘దూత’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతూ సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.

దీంతో ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థలు పెద్ద సూపర్ స్టార్స్ తో వెబ్ సిరీస్ లను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాయి. రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ సంస్థ అధినేత హైదరాబాద్ పర్యటనకి వచ్చి, మన టాలీవుడ్ స్టార్ హీరోలందరినీ కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తో అతి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ సంస్థ హాలీవుడ్ లో ఒక భారీ యాక్షన్ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. #RRR చిత్రం గ్లోబల్ వైడ్ గా రీచ్ అవ్వడానికి, ఆ సినిమా ఆస్కార్ అవార్డ్స్ రావడానికి ప్రధాన కారణం నెట్ ఫ్లిక్స్ అనడం లో ఎలాంటి అతిసయోక్తి లేదు. అందుకే ప్రభాస్ కూడా ఈ సంస్థ లో హాలీవుడ్ వెబ్ సిరీస్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఇందుకోసం ఆయనకీ సుమారుగా 200 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఏడాదిలోనే ఈ సిరీస్ మొదలు కాబోతుంది అట, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియనుంది. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయన తదుపరి చిత్రం ‘కల్కి’ మే 9 వ తేదీన విడుదల కాబోతుంది.

TAGS