Prabhas director : నందమూరి కుటుంబం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నాడు. ఎలాంటి క్యారెక్టర్ అయినా, ఎంత పెద్ద డైలాగ్ అయినా అవలీలగా చెప్పేస్తాడు. తన డైలాగ్ డెలివరీలో చాలా స్పష్టత ఉంటుంది. ఇక పోతే ఆర్ఆర్ఆర్ సినిమా సందర్భంగా రాంచరణ్ బర్త్ డే రోజున చరణ్ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ సాగే ట్రైలర్ ఎన్టీఆర్ తో వాయిస్ ఓవర్ తో సాగుతుంది. ఈ వాయిస్ ఓవర్ ను ఎన్టీఆర్ ఒక్కడే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో చెప్పి ఔరా అనిపించుకున్నాడు.
ఎన్టీఆర్ తన రెండో సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. తర్వాత ఆది, సింహద్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ర్టీ రికార్డులు బ్రేక్ చేశాడు. అలాగే అంతే ఫ్లాఫుల మూటగట్టుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో బొద్దుగా ఉన్నాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ యమదొంగ సినిమాతో ఒక్కసారిగా సన్నగా మారిపోయి షాక్ ఇచ్చాడు. ఏ విమర్శనేతే ఎదుర్కొంటాడో దానిని అధిగమించడం ఎన్టీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.
ఇక ఎన్టీఆర్ అంటే దర్శకుడు రాజమౌళికి ప్రత్యేక అభిమానం. వీవీ వినాయక్, పూరీ జగన్నాథ్ లాంటి దర్శకులు ఎన్టీఆర్ డ్యాన్సులకు ఫిదా అయ్యారు. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు కూడా. హీరో నాగార్జునకు ఎన్టీఆర్ డైలాగ్స్ ఎంతో ఇష్టమని చెబుతుంటాడు. ఇక ఎన్టీఆర్ ను అభిమానించే వారిలో మరో డైరెక్టర్ చేరిపోయాడు. అతను ఎవరో కాదు. లేటెస్ట్ గా ప్రభాస్ తో సినిమా స్టార్ట్ చేసిన సాఫ్ట్ డైరెక్టర్ హను రాఘవపూడి. సీతారామం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హను రాఘవపూడి ప్రస్తుతం ప్రభాస్ తో ఫౌజీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తున్నది. తాను ఎన్టీఆర్ అభిమానినని చెప్పుకోవడానికి గర్వపడుతుంటానని చెబుతున్నాడు.