JAISW News Telugu

Salaar : ‘సలార్’ చిత్రం మొత్తం మీద ప్రభాస్ నోరు తెరిచి మాట్లాడిన డైలాగ్స్ నిడివి ఇంతేనా!

prabhas dialogues in salaar movie

prabhas dialogues in salaar movie

Salaar : ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ‘సలార్’ గత ఏడాది విడుదలై ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మనమంతా చూసాము. సుమారుగా 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి టాలీవుడ్ వరకు నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. వెయ్యి కోట్లు కొడుతోంది అనే అంచనాలు ఉండేవి కానీ, ఎందుకో అది వర్కౌట్ అవ్వలేదు. రీసెంట్ గానే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టింది.

థియేటర్స్ లో విడుదలైనప్పుడు వచ్చిన రెస్పాన్స్ కంటే ఎక్కువగా ఓటీటీ స్ట్రీమింగ్ లో వచ్చింది అని చెప్పొచ్చు. ప్రతీ ఒక్కరు ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాలను కట్ చేసి అప్లోడ్ చేస్తూ ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ మొదటి నుండి ప్రారంభం వరకు డైలాగ్స్ చాలా తక్కువగా మాట్లాడుతాడు. ఫ్యాన్స్ కి ఇది కాస్త నిరాశ కల్గించింది.

సినిమా మొత్తం మీద ప్రభాస్  డైలాగ్స్ అన్ని కలిపితే 7 నిమిషాలు మాత్రమే ఉందట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండింగ్ అవుతున్న విషయం. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఇంత తక్కువ డైలాగ్స్ తో ఏ హీరో కూడా సినిమా తియ్యలేదని, గతం లో ఎన్టీఆర్ నరసింహుడు చిత్రం లో ఫస్ట్ హాఫ్ మొత్తం మాట్లాడకపోయినా సెకండ్ హాఫ్ మొత్తం అతనికి డైలాగ్స్ ఉన్నాయని, కానీ సలార్ చిత్రం లో మాత్రం ప్రభాస్ తక్కువ మాటలు ఎక్కువ యాక్షన్ తో అదరగొట్టాడని అంటున్నారు. అలా తక్కువ డైలాగ్స్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు.

ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్ 2 ‘ చిత్రాన్ని తీసేందుకు సిద్ధం అవుతున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆగష్టు నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందట. సలార్ చిత్రం కేవలం రెండు భాగాల్లో చెప్పే కథ కాదని, కనీసం నాలుగు భాగాలు అవసరం ఉంటుందని, అందుకు కావాల్సినంత కంటెంట్ నా దగ్గర ఉండని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియచేస్తారట.

Exit mobile version