Power Star Whiskey : ఏపీలో ‘999 పవర్ స్టార్ సుపీరియర్’ పేరుతో కొత్త విస్కీ వచ్చింది. దీనిపై కూటమి ప్రభుత్వం ‘పవర్ స్టార్’ పేరుతో కొత్త విస్కీ బ్రాండ్ ను తీసుకు వచ్చిందని వైసీపీ విమర్శించింది. నాణ్యమైన మద్యం అంటూ జనసైనికులను మెప్పించేలా ఈ బ్రాండ్ ను తెచ్చిందని ఆరోపించింది. దీనికి టీడీపీ-జనసేన శ్రేణులు స్పందించి దీటుగా సమాధానమిస్తున్నాయి.
ప్రపంచంలో ఎక్కడా దొరకని డేంజరస్ లిక్కర్ త్రీ క్యాపిటల్స్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్, బూమ్ బూమ్, 999 పవర్ స్టార్ బ్రాండ్ మద్యం తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమే అని ఆరోపిస్తున్నాయి. జగనే విషపు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యనుండి, ఇతరులపై విష ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఐదేళ్లలో ప్రమాదకరమైన మద్యంతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను వైఎస్ జగన్ తీశారని దుయ్యబట్టాయి. ఈ బ్రాండ్లు అన్ని వైసీపీ తెచ్చినవ అని టీడీపీ, జనసేన శ్రేణులు పేర్కొంటున్నాయి.