JAISW News Telugu

Contractors : రోడ్లపై గుంతలు.. కాంట్రాక్టర్లకు షోకాజ్ నోటీసులు

Contractors

Contractors

Contractors : రోడ్లను నాసిరకంగా నిర్మించడంపై గోవా ప్రభుత్వం 100 మందికి పైగా కాంట్రాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రోడ్లపై గుంతల కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు  ప్రభుత్వ ఇంజనీర్లే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. సీఎం ప్రమోద్ సావంత్ బుధవారం ప్రజా పనుల విభాగం సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వినాయక చవితి పండగ నాటికి రోడ్లపై గుంతలు కనబడకుండా చేయాలని ఆదేశించారు.

రోడ్లపై గుంతల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని పీడబ్ల్యూడీ సీనియర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇంజినీర్లతో పాటు 100 మందికి పైగా రోడ్డు కాంట్రాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సీఎం తెలిపారు. కాంట్రాక్టర్లు ప్రాధాన్యతల ప్రాతిపదికన గుంతలను పూడ్చాలన్నారు. ఈ పనులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక భారాన్ని తీసుకోదని స్పష్టం చేశారు.

Exit mobile version