IAS in AP : ఏపీలో ఐఏఎస్ లకు పోస్టింగ్స్.. టూరిజం ఎండీగా ఆమ్రపాలి

IAS in AP
IAS in AP : డీవోపీటీ ఆదేశాలతో తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఐఏఎస్ అధికారులకు సీఎస్ నీరభ్ కుమార్ పోస్టింగులు కేటాయించారు. ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ వీసీఎండీగా ఆమ్రపాలిని నియమించారు. ఆమెకు ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ గా వాకాటి కరుణను సీఎస్ నియమించారు. దీంతో పాటు జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్ గా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్ గా జ.వాణిమోహన్ ను బదిలీ చేశారు. వాణి మోహన్ కు జీఏడీలో సర్వీసుల వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఆ బాధ్యతలు చూస్తున్న పోల భాస్కర్ ను సీఎస్ రిలీవ్ చేశారు. కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్ ను నియమించారు. కార్మిక శాఖ అదనపు బాధ్యతల నుంచి ఎంఎం నాయకు ను ప్రభుత్వం రిలీవ్ చేసింది. మరో ఐఏఎస్ రొనాల్డ్ రోస్ కు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.