Jana Sena : ఏపీ డిప్యూటీ సీఎం, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు 10 వేల ఉత్తరాలు పంపించాలని నిర్ణయించారు. మైలవరం థర్మల్ విద్యుత్ ప్లాంట్ తో వెలువడుతున్న కాలుష్యంపై ఉద్యమాలను తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు 10 వేల పోస్ట్ కార్డు ఉత్తరాలు పంపనున్నారు.
ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధికారప్రతినిధి, మైలవరం నియోజకవర్గం జనసేన ఇన్ చార్జి అక్కల గాంధీ పాల్గొన్నారు. తను తమ పార్టీ అధ్యక్షుడికి కార్డు రాయడమే కాకుండా.. ఎలా రాయాలన్న దానిపై ఇతరులకు అవగాహన కల్పించారు. షాప్ టూ షాప్ తిరిగుతూ కార్డులు అందజేస్తూ అందరికీ అవగాహన కల్పించి అందరితో ఉత్తరాలు రాయించాడు. అనంతరం వాటికి పోస్ట్ చేశాడు. తమ వంతు బాధ్యతగా స్థానిక ప్రజల కు అండగా నిలడాలని పవన్ కోరనున్నారు.
గత కొన్నేళ్లుగా మైలవరం థర్మల్ విద్యుత్ ప్లాంట్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ ప్లాంట్ మూలంగా కాలుష్యం పెరిగి జీవులన్నీ సతమతం అవుతున్నాయని, వాయు కాలుష్యంతో పాటు జల, భూ కాలుష్యం కూడా కలుగుతుందని వాపోయారు. ఈ విషయాన్ని పార్టీ నాయకుడికి వివరించి థర్మల్ పవర్ ప్రాజెక్టులో నూతన పరికరాల కొనుగోలు లేదా.. థర్మల్ ప్రాజెక్ట్ మార్పునకు చర్యలు తీసుకోవాని కోరినట్లు నాయకులు చెప్పారు.
తమ నాయకుడు దీనిపై వేగంగా చర్యలు తీసుకుంటాడని తమకు నమ్మకం ఉందని జనసేన పార్టీ నాయకులు అంటున్నారు. పర్యావరణ, పంచాయతీ రాజ్ శాఖలు పవన్ కళ్యాణ్ వద్దే ఉన్నాయని, అందుకే పవన్ కు లేఖలు పంపుతున్నట్లు అక్కల గాంధీ చెప్తున్నారు.