Posani:టీడీపీ హయంలో అనర్హులకే నంది అవార్డులు:పోసాని కృష్ణమురళి
Posani:ఏపీలో నంది నాటకోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఆంధ్రప్రదేష్ చలన చిత్ర, టీవీ మరయు నాటక రంగ అభివృద్ధి సంస్థ, బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి గత టీడీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకే అవార్డులు దక్కాయని సెటైర్లు వేశారు.
పోసాని మాట్లాడుతూ గతంలో నంది అవార్డుల్లో తనకు అన్యాయం జరిగిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక నన్ను చైర్మన్ చేశారు. అర్హులైన వారికి మాత్రమే అవార్డులు ఇస్తున్నాం. కళాకారులకు గుర్తింపునిచ్చే ప్రభుత్వం ఇది. నాటక రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. వర్క్ షాప్‌లు నిర్వహించి కళాకారులను ప్రోత్సహిస్తాం` అన్నారు.
మంత్రి మాట్లాడుతూ ` మొత్తం 73 అవార్డులు ఇవ్వబోతున్నామని, 38 నాటక సమాజాల నుంచి 1200 మంది కళాకారులు పాల్గొంటున్నారని, కళాకారులకు అత్యుత్తమ వసతులు కల్పించామని తెలిపారు. శనివారం మొదలైన నందినాటకాలు ఈ నెల 29 వరకు సాగనున్నాయి. నంది నాటకోత్సవాల ప్రాంగణంలో ఏపీ సీఎం జగన్ 100 అడుగుల భారీ కటౌట్‌ని ఏర్పాటు చేశారు.