JAISW News Telugu

Poonam Pandey : చనిపోయాను అంటూ జనాలను ఫూల్స్ ని చేసిన పూనమ్ పాండే కి కఠిన శిక్ష!

Poonam pandey was severely punished

Poonam pandey was severely punished

Poonam Pandey : ఇటీవల కాలం లో సోషల్ మీడియా లో మారుమోగిపోయింది పేరు పూనమ్ పాండే. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన మ్యానేజర్ తో ఈమె చనిపోయినట్టు ఒక పోస్ట్ వేయించింది. ఈమె నిజంగానే చనిపోయింది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెద్ద ఎత్తున విచారణ వ్యక్తం చేసారు. ఇంత చిన్న వయస్సులో ఎలా చనిపోయింది పాపం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థన చేసారు.

కానీ ఆ మరుసటి రోజే నేను చనిపోలేదు, కేవలం సర్వైవల్ క్యాన్సర్ మీద అవగాహన పెంచేందుకు కోసమే అలా చెప్పాను. ఇప్పుడు ఆ క్యాన్సర్ కి సంబంధించి అందరిలో నా ద్వారా చైతన్య వచ్చినందుకు సంతోషం గా ఉంది, ఇది మిగతా క్యాన్సర్ లాగ కాదు, దీనిని నివారించుకోవచ్చు, ఆ నివారణ చర్యలు ఎలాంటివో నా బయో లో లింక్ పెట్టి ఉన్నాను చూడండి అంటూ ఒక వీడియో చేసింది.

ఈ పోస్ట్ పై కొంతమంది మాలో అవగాహన పెంచే కార్యక్రమం చేసినందుకు కృతఙ్ఞతలు అని చెప్పుకొచ్చారు. కానీ కొంతమంది చాలా కోపం తెచ్చుకున్నారు. జనాల ఎమోషన్స్ తో ఆడుకొని పబ్లిసిటీ చేసుకోవాలి అనుకోవడం చాలా నీచమైన చర్య, ఈసారి నిజంగా ఏమైనా జరిగినా ఎవ్వరూ నమ్మరు. ఇలాంటోళ్ళపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఈమెపై పోలీస్ కేసు కూడా నమోదు చేసారు. ఒకవేళ పోలీసులు ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకొని పూనమ్ పాండే పై కేసు నమోదు చేస్తే ఆమెకి మూడు ఏళ్ళ జైలు శిక్ష తో పాటుగా 5 లక్షల రూపాయిల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆమెకి జైలు శిక్ష పడుతుందా లేదా అనేది కోర్టు లో ఆమె ఇచ్చే వివరణని బట్టీ ఉంటుంది.

పూనమ్ పాండే ఒక పెద్ద సెలబ్రిటీ, ఆమెకి నిజంగా ఈ క్యాన్సర్ వ్యాధి మీద అవగాహన పెంచాలనే చిత్తశుద్ధి ఉంటే, మొదటి నుండి క్యాంపైన్ ద్వారా అందరికి చేరేలా చెయ్యొచ్చు. ఎంతో మంది సెలబ్రిటీస్ అనుసరించే పద్దతి ఇది. కానీ పూనమ్ పాండే ఇలా చెయ్యడం వల్ల అందరు ఆమెని తిట్టుకున్నారు కానీ, ఆమె చెప్పే సర్వైవల్ క్యాన్సర్ గురించి ఎవ్వరూ వినలేదు. ఇది కేవలం ఆమె పబ్లిసిటీ పిచ్చి మీదనే చేసినట్టు తెలుస్తుంది, గతం లో కూడా ఆమె ఇలాంటి ప్రాంక్స్ చాలానే చేసింది.

Exit mobile version