Pooja Hegde:టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఒక దశలో తెలుగులో వరుస క్రేజీ స్టార్లతో కలిసి నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన పూజా హెగ్డేకు ప్రస్తుతం టాలీవుడ్లో ఎదురుగాలి వీస్తోంది. కొత్త ప్రాజెక్ట్‌లు లభించకపోగా ఉన్న ప్రాజెక్ట్‌లు ఇటీవల చేజారాయి. సూపర్ స్టార్ మహేష్‌తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న `గుంటూరు కారం`లో ముందు పూజా హెగ్డేనే అనుకున్నారు. మధ్యలో ఏం జరిగిందో ఏమోకానీ ఆమెని తప్పించి శ్రీలీల, మీనాక్షీ చౌదరిలని ఫైనల్ చేసుకున్నారు.
ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో హరీష్ శంకర్ రూపొందిస్తున్న `ఉస్తాద్ భగత్‌సింగ్` మూవీ కోసం కూడా ముందు పూజా హెగ్డేని అనుకున్నారు. తరువాత డేట్స్ సమస్య తలెత్తడంతో ఆమెని తప్పించి శ్రీలీలను తీసుకున్నారు. దీంతో తెలుగులో పూజా హెగ్డే రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లని కోల్పోయింది. ప్రస్తుతం తన చేతిలో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఇదిలా ఉంటే పూజా హెగ్డే తాజాగా వార్తల్లో నిలిచింది. ఆమెకు సంబంధించిన ఓ తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పూజా హెగ్డే వార్తల్లో నిలిచింది.
పూజా ఇటీవల దుబాయ్‌లో ఓ కార్యక్రమానికి వెళ్లారని, అక్కడ పెద్ద గొడవ జరగడంతో కొందరు వ్యక్తులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె అభిమానులు కంగారుపడుతూ బుట్టబొమ్మకు ఏం జరిగిందా? అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే ఈ వార్తలపై పూజా హెగ్డే టీమ్ వివరణ ఇచ్చింది. అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేసింది. అసలు ఇలాంటి తప్పుడు వార్తలు ఎలా పుడతాయో తెలియదు. దయచేసి ఇలాంటి వార్తలను నమ్మకండి` అని క్లారిటీ ఇచ్చింది.