Pooja Hegde Saree : కేవలం ఒకటి రెండు సినిమాలతోనే యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు పూజ హెగ్డే. నాగ చైతన్య హీరో గా నటించిన ‘ఒక లైలా కోసం’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన పూజా హెగ్డే, ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత బాలీవుడ్ లో ఏకంగా తన అభిమాన హీరో ‘హృతిక్ రోషన్’ తో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం తో కొన్నాళ్ళు ఆమె సినిమాల్లో కనిపించలేదు.
రెండేళ్లు గ్యాప్ తీసుకొని హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయం లోనే పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం పవన్ కళ్యాణ్ తో తప్ప దాదాపుగా అందరి స్టార్ హీరోలతో పూజా హెగ్డే నటించేసింది.
అలా దూకుడుతో ఇండస్ట్రీ లోకి దూసుకుపోతున్న పూజా హెగ్డే ఈమధ్య కాలం లో బాగా స్లో అయ్యింది. అమితమైన పారితోషికం డిమాండ్ చెయ్యడం, వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం తో పాటుగా, శ్రీలీల మేనియా కూడా టాలీవుడ్ లో ఒక రేంజ్ లో కొనసాగుతుండడం తో పూజ హెగ్డే కి అవకాశాలు భారీ గా తగ్గడానికి కారణం అయ్యింది. కానీ అభిమానులు మాత్రం పూజా ని బాగా మిస్ అవుతున్నారు. ఆమె రీ ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ ని బాగా వాడుతుంది అనే విషయం తెలిసిందే. తనకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా ఆమె ధరించిన పట్టు ఆకుపచ్చని పట్టు చీర ని చూసి నెటిజెన్స్ నోరెళ్లబెట్టారు.
అచ్చు గుద్దినట్టు బుట్టబొమ్మ లాగానే ఉన్నావు అంటూ ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపించారు. ఆమె ధరించిన ఆ చీరని కొనుగోలు చెయ్యడానికి కొంతమంది ప్రయత్నం చేసారు. అయితే దాని ధర ని చూసి కంగుతిన్నారు. పూజా హెగ్డే ధరించిన ఆ చీర ధర దాదాపుగా 12 లక్షల రూపాయిలు ఉంటుందట. అంత డబ్బు ఉంటే సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు ఎన్నో ముఖ్యమైన పనులు చేస్తాడు అనే చెప్పొచ్చు. సెలబ్రిటీస్ ధరించే దుస్తులు, వాడే వస్తువులు ఆ రేంజ్ లో ఉంటాయి మరి.