Ponguleti Srinivas Reddy : ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సోనియా గాంధీ ని పోటీలో నిలబెడుదామనుకున్నారు. ఆ తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అనుకున్నారు.పార్టీ అధిష్టానం ఆ ఇద్దరి విషయంలో ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఖమ్మం టికెట్ కోసం పోటీ తీవ్రమైనది.ఖమ్మంలో ఉన్న యోధాను యోధులు హైదరాబాద్ నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు ఎంత పలుకుబడి ఉంత పలుకుబడిని ఉపయోగించారు.అయినా అధిష్టానం తన పని తాను చేసుకుంటూ పోయింది. అభ్యర్థి గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో ఏ ఏ అర్హతలు ఉండాలో ఆ అర్హతలు ఉన్న నాయకుడినే ఎట్టకేలకు ఎంపిక చేసి చేతులు దులుపుకుంది.గురువారంతో నామినేషన్ ప్రక్రియ ముగియ నున్న నేపథ్యంలో అభ్యర్థిని ప్రకటించింది.ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన చివరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు.
ఖమ్మం టికెట్ కోసం రాష్ట్రానికి చెందిన ముగ్గురు మంత్రలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరంగా చేసారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాయల నాగేశ్వర్ రావ్ కో పట్టుపట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డ్ తన సోదరుడు అయినటువంటి ప్రసాద్ రెడ్డి కోసం ప్రయత్నం చేశారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ తన కుమారుడు యుగందర్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు.ముగ్గురు మంత్రుల ఒత్తిడి తో కాంగ్రెస్ అధిష్టానంకు ఖమ్మం సమస్య కత్తిమీది సాములా తయారైనది. ఈ ఎం ముగ్గురితోపాటు సీనియర్ న నాయకుడు అయినా హన్మంత్ రావ్ కూడా తనదయిన శైలిలో ప్రయత్నాలు చేశారు.హన్మంత్ రావ్ గురించి ఢిల్లీ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ముగ్గురిని ఎలా ఒపించాలో అంతుపట్టక ఒక దశలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సతమతమయ్యింది అని చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం అభ్యర్థి ఎంపిక బాధ్యతని ఎన్నికల కమిటీకి అప్పగించడం విశేషం.
ఎట్టకేలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం భర్తీ ఎంపికపై పైచేయి సాధించాడు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి సురేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.ఖమ్మం లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం వెనుక సురేందర్ రెడ్డి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే సురేందర్ రెడ్డి కొడుకు రఘురాం రెడ్డికి ఖమ్మం టికెట్ దక్కిందని అభిప్రాయం ఉంది.అంతే కాదు పొంగులేటి వియ్యంకుడు సురేందర్ రెడ్డి కావడం కొసమెరుపు .