Supreme Court : దీపావళి వేళ కాలుష్యం.. తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు

Supreme Court
Supreme Court : దీపావళి వేళ ఢిల్లీలో కాలుష్యం పెరగడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. నిషేధం ఉన్నా దీపావళి రోజు ఢిల్లీలో టపాసులు కాల్చడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రజలు నిషేధాన్ని ఉల్లంఘిస్తుంటే ఏం చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేశ రాజధానిలో బాణసంచా కాల్చడంపై ఉన్న నిషేధం ఎందుకు అమలు కావడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ ఏడాది నిషేధాన్ని అమలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం పోలీసు కమిషనర్ కు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. అలాగే వచ్చే ఏడాది నిషేధం అమలు కోసం ప్రతిపాదిత చర్యలు అందులో పొందుపరచాలని ఆదేశించింది.