JAISW News Telugu

Polling Stations : పోలింగ్‌ కేంద్రాలు ఫిక్స్‌..

Polling Stations

Polling Stations

Polling Stations : ఎన్నికల నోటిఫికేషన్‌కు సన్నద్ధం అవుతున్న దశలో ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల యంత్రాంగం పోలింగ్‌ కేం ద్రాలను ఫిక్స్‌ చేసింది. ఈ మేరకు ఫిక్స్‌ చేసి న పో లింగ్‌ కేంద్రాల వివరాలను జిల్లా ఎన్నికల యంత్రాం గం రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిం చింది. పో లింగ్‌ కేంద్రాలను ఫిక్స్‌ చేయటం వల్ల వీటిని మార్చే అవకాశం అయితే లేదు. తుది ఓటర్ల జాబితా అనంతరం ఓటర్ల దామాషాకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలను పెంపుదల చేయాల్సి వచ్చింది. కొద్దిరో జుల కిందటే విజయవాడ సెంట్రల్‌ నియోజకవ ర్గంలో పది పోలింగ్‌ కేంద్రాలను పెంచారు.

ఇలా ప్రతి నియోజకవర్గం పరిధిలో స్వల్పంగా పోలింగ్‌ కేంద్రాలు పెరిగాయి. కలెక్టర్‌ దిల్లీరావు ఇటీవల తరచూ రాజకీయ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతూ పోలింగ్‌ కేంద్రాల పెంపుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1781 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో తిరువూరు నియోజకవర్గంలో 234 పోలింగ్‌ కేంద్రాలు, విజయవాడ ఈస్ట్‌ నియో జకవర్గంలో 253 పోలింగ్‌ కేంద్రాలు, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 257 పోలింగ్‌ కేంద్రాలు, విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గంలో 298 పోలింగ్‌ కేంద్రాలు, మైలవరం నియోజకవర్గంలో 295 పోలింగ్‌ కేంద్రాలు, నందిగామ నియోజకవర్గంలో 222 పోలింగ్‌ కేంద్రాలు, జగ్గయ్యపేట నియోజక వర్గంలో 222 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

గన్నవరం నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్‌ కేంద్రాలు ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోనే..

ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 నియోజకవర్గాల పరిధిలో 1781 పోలింగ్‌ కేంద్రాలు కాకుండా కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవ ర్గానికి సంబంధించి విజయవాడ రూర ల్‌ మండ లం పరిధిలోని పలు గ్రామాలు ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో ఉన్నాయి. ఇవి 82 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. గన్నవరంతో కూడా కలిపితే మొత్తం 1863 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.

Exit mobile version