JAISW News Telugu

Justice for Gitanjali : గీతాంజలి కుటుంబానికి న్యాయం చేయకుండా రాజకీయాలా?

Justice for Gitanjali

Justice for Gitanjali

Justice for Gitanjali : ఏపీలో రాజకీయాలు ఎంత క్రూరంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇక్కడ సాధారణ జనాల జీవితాలను సైతం ఫణంగా పెడుతారు రాజకీయ నాయకులు. రాజకీయ రొచ్చులోకి వెళ్లామా ఇక బయటకు రావడం కష్టం. సామాన్యులు ఇబ్బందులు పడినా ‘పెద్దలు’ మాత్రం తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. ఇప్పుడు ఏపీలో గీతాంజలి అనే యువతి మృతి ప్రకంపనలు రేపుతోంది. ఆమె మృతదేహం చుట్టూ చేస్తున్న రాజకీయం, నిజాలు వెలికితీయకుండా చేస్తున్న తప్పుడు ప్రచారం చూస్తుంటే ఎవరికైనా ఈ రాజకీయాలను చూస్తే ఏవగింపు కలుగక మానదు. గీతాంజలి మృతి వెనుక చాలా మిస్టరీ ఉంది. దాన్ని దాచేసి సోషల్ మీడియా పేరుతో రాజకీయం చేయడం జనాలకు అసహ్యం వేస్తోంది.

గీతాంజలి ప్రమాదం జరిగిన వెంటనే చనిపోయారు. ఐదు రోజుల పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడారు. ఈ మధ్య కాలంలో ఆమె ప్రమాదానికి గురైందని కానీ చావు బతుకుల్లో ఉన్నారని కానీ ఎవరికీ తెలియదు. ఆమెతో వీడియోలు చేయించుకుంటున్న వైసీపీ సోషల్ మీడియా టీం సజ్జల భార్గవకు తప్ప.

గీతాంజలి ప్రభుత్వ పథకాలను పొగుడుతున్న వీడియోను మొదటి సారిగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ మార్చి 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలు సోషల్ మీడియా టీం డిలీట్ చేసినా.. స్క్రీన్ షాట్లు రెడీగా సాక్ష్యంగా ఉన్నాయి. ఆమె జగన్ ప్రభుత్వాన్ని పొగిడిన వైనాన్ని బాగానే ప్రజెంట్ చేసుకున్నారు.

మార్చి 7న ఉదయం 11గంటలకు గీతాంజలి తెనాలి రైల్వే స్టేషన్ లో ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేర్చారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 11న గీతాంజలి చనిపోయింది. ప్రమాదానికి గురైన సమయంతో సహా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

గీతాంజలి చావు బతుకుల్లో ఉన్న విషయం ఎవరికీ తెలియదు. వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేసిన వీడియోలో ఉన్న మహిళ ఎవరో కూడా తెలియదు. కానీ ఆ మహిళ చెబుతున్న అంశాలపై ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు మార్చి 7వ తేదీన సాయంత్రం నుంచి ప్రశ్నించడం ప్రారంభించారు. ఇల్లు రాకుండానే అద్దె వస్తుందని.. ఐదేళ్లు అమ్మఒడి ఇచ్చారని చెప్పారు. కానీ ఆమె పిల్లలు బడికెళ్లే వయసు లేని వాళ్లే అంటే రైలు ప్రమాదం జరిగిన తర్వాత.. ఆస్పత్రిలో చేరిన తర్వాతనే ఆమె వీడియోల్లోని అంశాలపై ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ప్రశ్నించడం ప్రారంభించారు. ఇది పదో తేదీ వరకూ జరిగింది. అంటే ఆమె ప్రమాదంలో ఉందని ఎవరికీ తెలియదు.

దీన్ని బట్టి చూస్తే.. గీతాంజలి ప్రమాదం లేదా ఆత్మహత్య అనేది సోషల్ మీడియా పోస్టుల వల్ల కాదని స్పష్టమవుతుంది. చాలా క్లియర్ గా గీతాంజలి ప్రమాదానికి గురైన తర్వాతనే వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెకు ప్రమాదం జరిగినట్లుగా వైసీపీ సోషల్ మీడియాకు తప్ప ఎవరికీ తెలియదు. చనిపోయన తర్వాత.. ట్రోలింగ్ వల్ల చనిపోయిందంటూ వారే ప్రచారం చేశారు. ఈ డిటైల్స్ అన్ని ఎలా తెలిశాయో మిస్టరీగానే ఉంది.

దీనిపై సమగ్ర విచారణ జరపాలని ప్రమాదం జరిగిన పరిస్థితులపై పరిశోధన జరిపి ప్రమాదమా లేదా ఆత్మహత్య అనేది తేల్చాలనేది ప్రజలు చేస్తున్న డిమాండ్. ఇందులో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయోజనం పొందేందుకు కుట్ర చేసి ఉంటే.. బయట పెట్టాల్సి ఉంది. తెనాలి రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని వెంటనే విడుదల చేయాలి. ఈ అంశంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు సోషల్ మీడియా మీద నెపం పెట్టి అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి.. రూ.20 లక్షల సాయం కింద ప్రకటించి.. స్టేట్ మెంట్లు ఇప్పించడం కన్నా ఓ మహిళ కుటుంబానికి నిజాలేమిటో వెల్లడి చేసి న్యాయం చేయాలి.

Exit mobile version