JAISW News Telugu

Singareni:సింగ‌రేణిలో పోలిటికల్ హీట్ మొద‌లైంది..రంగంలోకి కాంగ్రెస్‌

Singareni:సింగ‌రేణి కాల‌రీస్‌లో పొలిటిక‌ల్ హీట్ మొద‌లైంది. ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అనుబంధ యూనియ‌న్ పాల్గొన‌రాద‌ని గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఆదేశాలు జారిచేయ‌డం తెలిసిందే. దీనిపై యూనియ‌న్ స‌భ్యులు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. పోటీ నుంచి త‌ప్పుకోవ‌డం అంటే ఆత్మ‌హ‌త్యాసద్రుశ్య‌మేన‌ని వాపోతున్నారు. ఇదిలా ఉంటే సింగ‌రేణి ఎన్నిక‌ల స‌మ‌రంలో కాంగ్రెస్‌-సీపీఐ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌లేదు.

ఎన్నిక‌ల్లో రెండు పార్టీల అనుబంధ సంఘాలు త‌ల‌ప‌డుతున్నాయి. ఐఎన్‌టీయూసీకి మ‌ద్ద‌తుగా మంత్రులు, కాంగ్రెప్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఈ క్ర‌మంలో ఏఐటీయూసీ ప్ర‌చారాన్ని ఉధృతం చేస్తోంది. కాగా బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకెఎస్‌లో ప్ర‌స్తుతం గంద‌ర‌గోళం కొన‌సాగుతోంది. కాగా సింగ‌రేణి ఎన్నిక‌ల‌ను కార్మికులు బ‌హిష్క‌రించాల‌ని మావోయిస్టు సింగ‌రేణి కోల్ బెల్ట్ ఏరియా క‌మిటీ కార్య‌ద‌ర్శి ప్ర‌భాత్ పేర్కొన్నారు.

ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. జాతీయ కార్మిక సంఘాల‌తో పాటు తెలంగాణ సెంటిమెంట్‌తో గెలిచిన టీబీజీకేఎస్ కూడా కార్మికుల‌ను మోసం చేసింద‌ని చెప్పారు. సింగ‌రేణిలో కుంభ కోణాలు, అవినీతి, అణ‌చివేత‌లో కార్మిక సంఘాల పాత్ర కూడా ఉంద‌ని ప్ర‌భాత్ స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు శ్రీ‌రాంపూర్‌లో సింగ‌రేణి ఎన్నిక‌ల ర‌గ‌డ నెల‌కొంది. ఐఎన్టీయూసీ నేత‌ల స‌మావేశంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. పాత – కొత్త నాయ‌కుల మ‌ధ్య విభేదాలు ముదిరి తీవ్ర ఘ‌ర్ష‌ణ‌కు దారి తీశాయి. టీబీకేఎస్ నాయ‌కుల‌ను చేర్చుకోవ‌డంపై సీనియ‌ర్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వారి వ‌ల్ల ఎన్నిక‌ల్లో నష్ట‌పోతామ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Exit mobile version