JAISW News Telugu

Hyderabad Traffic : పోలీసుల కొత్త ప్రయోగం.. హైదరాబాద్ ట్రాఫిక్ కు తక్షణ పరిష్కారం

Hyderabad Traffic

Hyderabad Traffic

Hyderabad Traffic : రాజధాని నగరంలో ట్రాఫిక్ రోజు రోజుకు పెరిగిపోతుంది. నిత్యం కొన్ని వేల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. దీంతో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు కొత్త విధానాన్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‎లో ట్రాఫిక్ సమస్యలకు తొలగించేందుకు గతంలోనూ అనేక ప్రయత్నాలు చేశారు. సైబరాబాద్ పోలీసులు మరోసారి కొత్త విధానాన్ని అమలు చేసేందుకు రెడీ అయ్యారు. ఏరియల్ సర్వే లైన్స్ ద్వారా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించనున్నారు. ఇందుకు అత్యాధునిక టెక్నాలజీని కలిగి ఉన్న అడ్వాన్స్‎డ్ డ్రోన్ కెమెరాలను ఉపయోగించనున్నారు. 100 మీటర్ల రేడియస్ నుండి డ్రోన్ కెమెరాను ఎగురవేసి ట్రాఫిక్ జంక్షన్ దగ్గర ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. దీంతో ట్రాఫిక్ రద్దీని తెలుసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడవున్నాయి.

హైదరాబాద్‎లోని మూడు కమిషనరేట్ల పరిధిలోనూ సైబరాబాద్ ఐటీ కారిడార్ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ప్రతిరోజు ఇక్కడ ట్రాఫిక్ జామ్ లు సర్వసాధారణం. అందులోనూ వచ్చేది వానాకాలం కావడంతో ఆ సమయంలో ట్రాఫిక్ సమస్య మరింత రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని లక్షల మంది ఐటీ ఉద్యోగులు నిరంతరం ట్రాఫిక్ సమస్యల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు సైబరాబాద్ పోలీసులు ఈ కొత్త టెక్నాలజీని వినియోగించేందుకు రెడీ అవుతున్నారు. ఐటీ కారిడార్‎లో రద్దీగా ఉండే జంక్షన్‎లను టార్గెట్ చేసుకొని వాటి 100 మీటర్ల రేడియస్ పరిధిలో డ్రోన్ కెమెరాను ఎగరవేసి ఇది చూపించే విజువల్స్ ఆధారంగా ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు పోలీసులు చర్యలు చేపట్టనున్నారు.

ట్రాఫిక్ సమస్యలతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు ప్రమాదాల ఘటనా స్థలానికి త్వరితగతిన పోలీసులు చేరుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నేరుగా పోలీసులు వీక్షించే విధంగా డ్రోన్ కెమెరాను ఆపరేట్ చేస్తారు. ప్రమాదం జరిగిన చోటకు వెంటనే పోలీసులను పంపించే దిశగా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తారు. ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా కంట్రోల్ రూమ్‎కి చేరవేసే బాధ్యత ఈ డ్రోన్ కెమెరా మూడో కన్నులో ఉంటుంది.

Exit mobile version