Betting : బెట్టింగ్ యాప్‌ల ప్రమోట్ చేసిన సెలబ్రెటీలపై నేడు పోలీసుల విచారణ
betting : బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించినందుకు కేసులు ఎదుర్కొంటున్న పలువురు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈరోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. మొత్తం 17 మందిపై కేసు నమోదు కాగా, నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్ మరియు అజయ్ సన్నీలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరి ప్రమోషన్ల వల్ల అమాయక ప్రజలు బెట్టింగ్‌కు బానిసలవుతున్నారని సజ్జనార్ ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు.