Telangana Elections : ఎన్నికల వేళ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కు అతిపెద్ద ఆర్థిక వనరుగా.. బడా కాంట్రాక్టర్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ కు క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. తాజాగా ఆయన ఖమ్మంకు సరఫరా చేస్తోన్న నోట్ల కట్టలు బయటపడ్డాయి.
తాజాగా హైదరాబాద్ లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. హైదరాబాద్ నుంచి ఖమ్మం తరలిస్తుండగా.. అప్పా జంక్షన్ వద్ద రూ.6.5 కోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే తనిఖీల్లో రూ.570 కోట్లకు పైగా డబ్బు, బంగారం స్వాధీనం చేసుకోగా.. ఎన్నికల ముంగిట మరిన్ని కోట్లు బయటపడుతున్నాయి.
హైదరాబాద్ నుంచి ఖమ్మం తరలిస్తుండగా.. అప్పా జంక్షన్ వద్ద 6 కార్లలో రూ. 6.5 కోట్ల రూపాయలు తరలిస్తుండగా పోలీసుల తనిఖీలో బయటపడ్డాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన డబ్బుగా ఇది ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో ఖర్చు కోసమే తరలిస్తున్నట్టు సమాచారం. కేసు నమోదు చేసి కార్లను పోలీసులు సీజ్ చేశారు. పూర్తి నిజనిజాలు తెలియాల్సి ఉంది.