Film Shooting : దేవాలయం పరిసరాల్లో సినిమా షూటింగులకు ఆంక్షలు ఉంటాయి. కానీ నిన్న జరిగిన షూటింగ్ తో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుపతిలో షూటింగ్ ల నిర్వహణపై నిబంధనలు విధించారు. షూటింగ్ లకు అనుమతి ఇవ్వొద్దని చెబుతున్నా అధికారులు అమ్యామ్యాలకు ఆశపడి ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నారు. దీంతో రోడ్లన్ని బ్లాక్ చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
ఇవాళ జరిగిన ఓ షూటింగ్ అలిపిరి, నంది కూడలి, గోవిందరాజుల ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేశారు. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో రోడ్డు బ్లాక్ చేసి మరీ షూటింగ్ జరిపారు. దీంతో భక్తులు మండిపడ్డారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుంగా షూటింగ్ చేసుకోవాల్సి ఉండగా నిబంధనలను పాటించలేదు. దీంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
పోలీసులు అనుమతి ఇచ్చేటప్పుడే రక్షణ కల్పించలేమని ఎలాంటి ఇబ్బందులు కల్పించకుండా షూటింగ్ చేసుకోవాలని చెప్పినా వారు రోడ్డు బ్లాక్ చేసి మరీ షూటింగ్ జరపడం వివాదాస్పదమైంది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా షూటింగ్ చేస్తున్న వారిపై వాగ్వాదానికి దిగారు. పబ్లిక్ స్థలాల్లో న్యూసెన్స్ ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు తిరుపతిలో మామూలే.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా షూటింగ్ చేసుకుంటామని చెప్పి చివరకు ఇలా చేయడంపై ఆలయ సిబ్బంది కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆటంకం కలిగించకుండా చేసుకోవాల్సి ఉండగా ఆంక్షలను ఉల్లంఘించి మరీ వారు షూటింగ్ చేయడంతో పలువురు వారిపై మండిపడ్డారు. ఇలాంటి అనుమతులు ఇవ్వొద్దని సూచిస్తున్నారు.