Vijayawada Spa : విజయవాడ స్పా లో పోలీస్ రైడ్ ఎలా జరిగిందో చూడండి, పోలీసులకు చిక్కిన వైసీపీ కీలక నేత

Vijayawada Spa : విజయవాడ లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం .. 10 మంది మహిళలు, 13 మంది, విటులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇదే మొదట వచ్చిన బ్రేకింగ్ .. ఏపీ 23 యూట్యూబ్ ఛానల్ న్యూస్ బిల్డింగ్ నందు స్పా సెంటర్ నడుపుతున్నారని సమాచారం అని తెలిసింది .. కాసేపటికి .. యూట్యూబర్ చలసాని ప్రసన్న భార్గవ్ అనే వ్యక్తి ఈ స్పా నడుపుతున్నాడని క్లారిటీ వచ్చింది .. మీడియా పేరు. చెప్పి ఏదో ఒక గొట్టం పట్టుకుని సొసైటీలో చేస్తున్న దుర్మార్గాలకు ఇదొకటి కదా అనుకున్నాను ..

కానీ బాధాకరం అంశం ఏమంటే .. స్పా లో పట్టుబడ్డ …. అమ్మాయిల ఫోటోలు , విజువల్స్ బయటకు వచ్చాయి .. కానీ దాని ఆర్గనైజర్ , అక్కడికి వచ్చిన విటులు ఎక్కడా కనిపించలేదు .. ఇదేమి అన్యాయం .. బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇష్టం లేకపోయినా తమ శరీరాన్ని అద్దెకు ఇచ్చి మగవాళ్ళని సుఖపెట్టి .. ఇప్పుడు సమాజం ముందు తప్పు చేసినవారిలా ముఖం కనిపించకుండా ముసుగులు కప్పుకుని భయపడుతున్న అమ్మాయిల దృశ్యాలు బయటకు వచ్చాయి .. కానీ వారి దగ్గరకు వచ్చిన విటులు కనిపించలేదు ..

వ్యభిచారం అనగానే ఇటు మీడియా ఛానెల్స్ , యూట్యూబ్ ఛానెల్స్ , పత్రికలు , వెబ్ సైట్లు అన్నీ అలా ముసుగేసుకున్న అమ్మాయిల ఫొటోలే ప్రసారం చేసారు .. కానీ ఇదంతా నిర్వహిస్తున్న వ్యక్తి ఎక్కడా ? అలాగే విటులు ఎక్కడా కనిపించరే ? అసలు మనం చూపించాల్సింది .. సమాజం ముందు నిలబెట్టాల్సిన విటులను , నిర్వాహకులను కదా ? వీళ్లేం చేశారు పాపం .. వెళ్లేందుకు సమాజం ముందు అలా తల దించుకోవాలి ? ఆడదాన్ని ఆటబొమ్మలా … చేసిన ఈ సమాజం సిగ్గుపడాలి .. ఈ సృష్టికి మూలమైన ఆడదాన్ని ఇలా సెక్స్ వస్తువు కింద మార్చిన ఈ మగాళ్లు సిగ్గు పడాలి .. వాళ్ల ఆర్ధిక సమస్యలను అడ్డం పెట్టుకుని వారిని ఈ నీచమైన కార్యక్రమంలో తెచ్చిన నిర్వాహకులు సిగ్గుపడాలి .. కదా .. వీళ్లెందుకు తలదించుకుంటున్నారు అనుకున్నాను

ఇంకాసేపటికి ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ బయటకు వచ్చింది ..ఈ స్పా సెంటర్లో పట్టుబడిన ఒకానొక వీరుడు మంచం కింద దూరిన విజువల్స్ వైరల్ అయ్యాయి .. ఆయన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర నాయక్ .. గతంలో గిరిజన విద్యార్థి సమాఖ్య పేరుతో ఆందోళనలు , నిరసన కార్యక్రమాలు చేసేవాడు .. ఆ తర్వాత ఎస్టీ కమిషన్ సభ్యుడు అయ్యాడు

ఆయన ఈ స్పా సెంటర్ కి వచ్చి అమ్మాయితో ఉండగా పోలీసులు రైడ్ చేశారు .. పరువు పోతుందనే భయంతో ఆటగాడు మంచం కింద దూరి దాక్కున్నాడు .. పోలీసులు మెల్లగా మంచం కింది నుంచి ఆయన్ని లాగి పోలీస్ స్టేషన్ కి తెచ్చారు ..

కేవలం వ్యభిచారం కేసులో ఆడవాళ్ళని మాత్రమే చూపిస్తున్నారు .. విటులు ఎక్కడా ? అన్న నా ప్రశ్నకు ఆన్సర్ దొరికింది.. ఇలాంటి వ్యభిచారం కేసుల్లో విటుల పేర్లు బయటకు రావడం చాలా అరుదు .. కేవలం అమ్మాయిల ఫోటోలు మాత్రమే బయటకు వస్తాయి . అమ్మాయిలానే మాత్రమే బలిపశువుల్ని చేస్తారు .. కానీ మొట్టమొదటి సారి ఒక విటుడు , నిర్వాహకుడు పేరు ప్రముఖంగా వినిపించింది ..

కారణమేమంటే .. పట్టుబడిన విటుడు .. ఒక రాజకీయ పార్టీకి చెందిన వాడు కావడం ., నిర్వాహకుడు మీడియా ముసుగులో ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో హాట్ టాపిక్ అయింది .. మీడియా ముసుగులో ఈ చిల్లర పనులు ఏంటని సగం మంది తిడితే .. ఎస్టీ కమిషన్ లాంటి గౌరవప్రదమైన హోదాలో పని చేసి ఈ తప్పుడు పనులేంటని సమాజం తిట్టుకుంది .. ఇలాంటి వ్యభిచారం కేసుల్లో పట్టుబడిన అమ్మాయిల కంటే నిర్వాహకుడు , పట్టుబడిన విటుడు గురించి చర్చ ఎక్కువ జరిగింది .. ముఖ్యంగా .. అ ఎస్టీ కమిషన్ సభ్యుడు ఇలా మంచం కింద దూరం మరింతహైలెట్ అయింది ..

TAGS