Raj Pakala : పోలీసుల నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన రాజ్ పాకాల

Raj Pakala

Raj Pakala

Raj Pakala : ఫాంహౌస్ లో పార్టీ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీఎన్ఎస్ఎస్ 35 (3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు మోకిల పోలీసులు తెలిపారు. పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని, నేడు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. అడ్రస్ ప్రూఫ్, కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని సూచించారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసులకు ఆయన అందుబాటులోకి రాకపోవడంతో మోకిల ఇన్ స్పెక్టర్ పేరుతో ఉన్న నోటీసులను రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ లో రాజ్ పాకాల నివాసానికి అతికించారు.

ఈ నేపథ్యంలో రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించి అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో ఆయన కోరారు. భోజన విరామం తర్వాత జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి దీనిపై విచారణ చేపట్టనున్నారు.

TAGS