
MLA Jayanageswara Reddy
MLA Jayanageswara Reddy : వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్ట ప్రశ్నార్థకంగా మారిందని, నిర్మాణ వ్యయం పెరుగుతూ వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు 2014-19 మధ్య సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని పనులు ముందుకు తీసుకు వెళ్లారని చెప్పారు. శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందన్నారు. గత ప్రభుత్వం విధ్వంసాన్నే అజెండాగా పెట్టుకుందని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో సర్వనాశనం చేసి, ప్రాజెక్టును ప్రశ్నార్థకంగా మార్చారని ఆరోపించారు.