JAISW News Telugu

PM Modi : నేడు, రేపు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన.. పూర్తిస్థాయి షెడ్యూల్ ఇలా

PM Modi

PM Modi

PM Modi : లోక్‌స‌భ‌ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువ డ నుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 10 రోజుల్లో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాం తాల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాల ను మోదీ ప్రారంభించనున్నారు. అదేవిధంగా బీజేపీ బహిరంగ సభల్లో పాల్గొని మోదీ ప్రసంగి స్తారు. మోదీ సుడిగాలి పర్యటనల్లో భాగంగా మొదట తెలంగాణలో పర్యటించ నున్నారు. 

రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో మోదీ పర్యటన కొనసాగనుంది. లోక్‌స‌భ‌ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 లోక్‌స‌భ‌ నియోజకవర్గాలకుగాను తొమ్మిది నియోజకవర్గాలకు పార్టీ జాతీయ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. లోక్‌స‌భ‌ సమరానికి సిద్ధమవుతున్న క్రమంలో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది.

మోదీ పర్యటన ఇలా..

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో భాగంగా అదిలాబాద్, సంగా రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తారు. తొలిరోజు సోమవారం అదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.

సోమవారం ఉదయం 9.20గంటలకు మహారా ష్ట్రలోని నాగ్ పూర్ లో బయల్దేరి 10.20 గంటలకు అదిబాద్ కు చేరుకుంటారు.

ఉదయం 10.30 గంటల నుంచి 11గంటల వరకు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలు అభి వృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.

ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పార్టీ బహిరంగలో ప్రధాని మోదీ పాల్గొంటారు.

బహిరంగ సభ అనంతరం నాందేడ్ చేరుకొని అక్కడ నుంచి చెన్నై వెళ్తారు. చెన్నైలో కార్యక్ర మాలు ముగించుకొని రాత్రికి హైదరాబాద్ చేరుకొని రాజ్ భవన్ లో బస చేస్తారు.

మంగళవారం (5వ తేదీ) సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తారు.

10 గంటలకు రాజ్ భవన్ నుండి బయలుదేరి.. బేగంపేట విమానాశ్రయంకు వెళ్తారు. అక్కడి నుంచి సంగారెడ్డికి బయలుదేరుతారు.

10:40 నిమిషాలకు సంగారెడ్డికి చేరుకుంటారు.

10:45 నుండి 11:15 నిమిషాల వరకు అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతోపాటు పూర్తయిన ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేస్తారు.

ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12: 45 నిమిషాల వరకు పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగిస్తారు.

సంగారెడ్డి బహిరంగ సభ అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నం 12: 55 కు చేరుకుంటారు.

బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి ఒడిస్సాకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు.

Exit mobile version