PM Modi : దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ గెలవాలని పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా వాటి మేనిఫెస్టోలు విడుదల చేశాయి. ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అరుదుగానే ముందుకు వస్తుంటారు.
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది సుమారు 75 నిమిషాల పాటు సాగింది. ఇందులో పలు ప్రశ్నలు అడగాల్సిన సమయం ఉంటుంది. కానీ పరిమిత సంఖ్యలోనే ప్రశ్నలు అడిగారు. ఈ ఇంటర్వ్యూ స్క్రిప్టెడ్ అన్నట్టుగా ఉంది. దీంతో మోదీకి ఎలాంటి ఇబ్బందులు రాలేదని తెలుస్తోంది. పదేళ్లలో చేసిన అప్పుల చిట్టా ఎక్కువే ఉంది. కానీ దానికి సంబంధించిన ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. దీంతో మోదీకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
చేసిన అప్పుల విషయంలో ఎలాంటి క్వశ్చన్ వేయలేదు. మోదీకి కష్టాలు కలిగించే ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. దీంతో మోదీ సేఫ్ అయ్యారు. దేశప్రజలకు ఏం చెప్పాలని అనుకుంటున్నారనే ప్రశ్నలు అడగడంతో ఎలాంటి సమస్య రాలేదు. అలా ఇంటర్వ్యూ సాఫీగా సాగిపోయింది. వివాదాస్పదమైన ప్రశ్నల ఊసే లేకుండా మమ అనిపించడం గమనార్హం.
ఇందులో మోదీ తన ఆశలు, ఆశయాలు, కలలు గురించి ప్రస్తావించారు. తన మీద వచ్చే విమర్శలు, పాలనపై ఎదురయ్యే ప్రశ్నలు సంధించలేదు. మోదీ కోరుకున్న ప్రశ్నలు మాత్రమే వేయడం తెలిసిందే. ప్రధాని మోదీ సుడి వల్లే ఇలాంటి ఆఫర్లు వస్తుంటాయని అంటుంటారు. తనకు ఇబ్బందులు తెచ్చే ప్రశ్నలు ఎదురు కావడం లేకపోవడంతో సేఫ్ అయ్యారు.
ఈ ఎన్నికల్లో కూడా మోదీకి అన్ని అవకాశాలు కలిసొస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ అంత బలంగా లేకపోవడం కూడా బీజేపీకి మంచి ఊపు ఇచ్చే విజయం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే ఎన్నికలు బీజేపీకి ప్లస్ అయ్యేలా ఉన్నాయని చెబుతున్నారు.