PM Modi : పీవీ కుటుంబాన్ని కలిసిన ప్రధాని మోడీ.. మాజీ ప్రధాని సేవలను గుర్తు చేసుకున్న ప్రధాని మోడీ..

PM Modi

PM Modi

PM Modi : మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు గురించి ఎంత చెప్పినా తక్కువ. ఐదేళ్లు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆయన గొప్ప గొప్ప సంస్కరణలను తెచ్చారు. ఇంటర్నేషనల్ లెవల్ లో భారత్ ప్రతిష్ట ఇనుమడింప చేసేందుకు ఎన్నో పనులు చేపట్టారు. 18 భాషలను అనర్గళంగా మాట్లాడే పీవీ నర్సింహా రావు దక్షిణ భారత దేశ ఆణిముత్యం. దక్షిణ భారతం నుంచి మొదటి ప్రధానిగా ఆయన దేశానికి సేవలందించారు.

అలాంటి గొప్ప నాయకుడు పీవీ నర్సింహా రావుకు మోడీ ప్రభుత్వం 2023లో భారతరత్న అందజేసి సత్కరించింది. పీవీకి భారతరత్న ఇవ్వడంపై యావత్ భారత్ ముఖ్యంగా దక్షిణ భారతం మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఇవన్నీ పక్కన పెడితే.

ఈ రోజు తెలంగాణలో పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులను కలిశారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రతిష్ఠాత్మక భారతరత్న అవార్డును ప్రదానం చేసినందుకు ప్రధాని మోదీకి పీవీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, ప్రధాని మోదీ వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. భారతదేశ గొప్ప సంస్కృతిక వారసత్వం, ఇటీవలి సంవత్సరాల్లో దేశం సాధించిన గణనీయమైన పురోగతి, పరస్పర ఆసక్తి ఉన్న అనేక ఇతర అంశాలను వారు పరిశీలించారు.

‘హైదరాబాద్ చేరుకోగానే మన మాజీ ప్రధాని, గౌరవనీయ పండితుడు, రాజనీతిజ్ఞుడు శ్రీ పీవీ నరసింహారావు గారి కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమావేశం జరిగింది. నరసింహారావు గారికి భారతరత్న ప్రదానం చేసినందుకు వారు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మా సంభాషణ విస్తృతంగా ఉంది మరియు మేము అనేక విషయాల గురించి మాట్లాడుకున్నాము. ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశం పురోగతిపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం గురించి కూడా మాట్లాడుకున్నాం’ అని ప్రధాని మోదీ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.

TAGS