JAISW News Telugu

PM Modi : మరోసారి సుధీర్ఘ ధ్యానం

PM Modi

PM Modi

PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపారు. పార్టీ తరపున పోటీలో ఉన్న పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. మూడోసారి విజయం కోసం అహర్నిశలు కృషిచేసిన మోదీ కొద్ది గంటలపాటు ధ్యానం చేయడానికి ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఎంచుకున్నారు. ఆ వాతావరణ కేంద్రమే కన్యా కుమారిలోని వివేకానంద మెమోరియల్. అక్కడే మోదీ ధాన్యం చేస్తున్నారు. ఏకధాటిగా 48 గంటల పాటు ధ్యానం పట్టుదలతో చేస్తున్నారు. దింతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారి ధ్యానం లోకి వెళ్ళినట్లయ్యింది. గతంలో ఏ నాయకుడు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు. ఒకవేళ ప్రధాన మంత్రి హోదాలో వచ్చిన నాయకులు 48 గంటల పాటు గడిపిన రోజులు చరిత్రలో లేవు.  

ధ్యానంలో మోదీ కాషాయం వస్త్రాలు ధరించారు. రుద్రాక్ష జపమాల తో నే ధ్యానం చేస్తున్నారు. మొదటి రోజు సూర్య భాగవునుఁడికి జలం సమర్పించి ధ్యానంలోకి వెళ్లిపోయారు. అనంతరం భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస విగ్రహాల ముందు కొద్ది గంటలపాటు ధ్యానం లోనే కూర్చున్నారు. మౌనంగానే ధ్యానం చేస్తున్నారు. 1892 లో స్వామి వివేకానంద మూడు రోజుల పాటు ధ్యానం చేసిన ప్రాంతంలోనే మోదీ ధ్యానం చేయడం విశేషం. 

48 గంటల పాటు ఏకధాటిగా మోదీ ధ్యానంలో ఉండటంతో ఆ ప్రాంతం అంతా కూడా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. 2014 ఎన్నికల సమయంలో కూడా మోదీ కేదారినాథ్, శివాజీ ప్రతాప్ ఘడ్ ప్రాంతాలను సందర్శించి ధ్యానం చేశారు. అదేవిదంగా 2019 ఎన్నికల సమయంలో కూడా మోదీ ధ్యానం చేశారు. ధ్యానం కు వెళ్ళడానికి ముందు రోజు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. 

ప్రతి ఏటా దసరా సమయంలో దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మోదీ ఉపవాసం ఉంటారు. ఆ సమయంలో మోదీ కేవలం నిమ్మరసంతోనే ఉపవాస దీక్ష ను కొనసాగించడం విశేషం. 2014, 2019 ఎన్నికల సమయంలో ఏ విదంగా ధ్యానం చేశారో, ఇప్పుడు కూడా 48 గంటల పాటు ఏకధాటిగా ధ్యానం చేస్తున్నారు. 48 గంటల పాటు మోదీ కేవలం నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ద్రాక్ష రసంతో పాటు , పలు రకాల పండ్ల రసాలను మాత్రమే తీసుకుంటారు.

Exit mobile version