JAISW News Telugu

Narendra Modi:తొమ్మిదిన్న‌రేళ్ల‌లో తెలంగాణ‌కు మోదీ ఇచ్చిందేమీ లేదా?

Narendra Modi:మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి ప్రధాని మోడీ కలవడాన్ని స్వాగతిస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర సమస్యల పై ప్రధాని మోడీ గారికీ వివరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివరించడం సంతోష దాయకమన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో వివరించిన నిధుల విషయంలో చాల సార్లు కేసీఆర్ మోడిని కలవడం జరిగిందని, కేసీఆర్ ప్రధాని మోడీ కలిసిన ప్రతి సారీ చూస్తామని చెప్పారు తప్పా ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు.

విభజన చట్టంలో ముఖ్యంగా రహదారులు విషయంలో ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా ఒక్క హామీ కేంద్రం నెరవేర్చలేదని, మేము అధికారంలో ఉన్నప్పుడు రాసిన లేఖలే మరోసారి మోడీ గారికీ ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రహదారులు విషయంలో ఎన్నోసార్లు పార్ల మెంట్ లో మాట్లాడం జరిగిందని, 2014 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎయిమ్స్ ఇచ్చినప్పుడు ఒక్కరు మాట్లాడలేదని వినోద్ గుర్తు చేశారు. ఇవ్వాళ బీబీనగర్ లో ఎయిమ్స్ వచ్చిందీ అంటే దానికి కారణం బీ ఆర్ఎస్ పార్టీనే. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం ఎన్నడూ కేంద్రం దగ్గర రాజీ పడలేదు, ప్రతిసారీ పార్లమెంట్ లో గోంతుచించుకుని మాట్లాడం జరిగిందని ఆయన అన్నారు.

బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినాదం ఇచ్చిందే బిఆర్ఎస్ పార్టీ అని, ఖాజీ పేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాట చెయ్యాల్సిన అవసరం ఉన్నదని, ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు వచ్చినప్పుడు 45 వేల కోట్ల రూపాయలతో బుందేల్ ఖండ్ కు ప్రాజెక్ట్ ఇచ్చారని, కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఉన్నాయి అని అక్కడ మోడీ అప్పర్ భద్రకు ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇచ్చారని వినోద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రతి సారి మోడీ అన్యాయం చేశారని, ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాట చెయ్యాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Exit mobile version