PM Modi : డొనాల్డ్ ట్రంప్ కు పీఎం మోదీ అభినందనలు

PM Modi congratulates Donald Trump
PM Modi : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కు భారత ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. భారత్-యుఎస్ మధ్య సమగ్ర ప్రపంచ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని అన్నారు.
‘‘ఈ చారిత్రాత్మక ఎన్నికల విజయానికి నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ కి హృదయపూర్వక అభినందనదలు. మీరు మీ మునుపటి పదవీకాల విజయాల ఆధారంగా, భారత్-యుఎస్ సమగ్ర ప్రపంచ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మా సహకారాన్ని పునరుద్ధరించడానికి నేను ఎదురుచూస్తున్నాను’’ అని ఎక్స్ లో పోస్టు చేశారు. 2016-2020 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ తో గతంలో జరిగిన సమావేశాల చిత్రాలను కూడా పీఎం మోదీ పోస్టు చేశారు.