JAISW News Telugu

PM Modi : మోదీ దూకుడుకు ఎవరైనా తగ్గాల్సిందే..ఇప్పుడిదే భారత్ నైజం..

PM Modi

PM Modi

PM Modi : గతంలో భారత్ అంటే ఇతర దేశాలతో సఖ్యతగా ఉండాలి. మనకై మనం ఎవరిపై యుద్ధానికి పోకూడదు. వారు యుద్ధానికి వచ్చినప్పుడే మనం సిద్ధం కావాలి..విదేశాంగ విధానం కూడా ఇతరులను నొప్పించకుండా ఉండాలి..ఇలా ఉండేది మన దేశ విధానం. కానీ ప్రధానిగా నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత భారత్ వైఖరి మారిపోయింది. దేశానికి దూకుడు వచ్చిందనే చెప్పాలి.

ప్రస్తుతం ప్రపంచం భారత్ ను చూసే వైఖరి మారిపోయింది. ఒకప్పుడు పేద దేశం..సాయమందిస్తే తీసుకుంటుంది అనే ఆలోచనలతో ధనిక దేశాలు ఉండేవి..ఇప్పుడవే దేశాలు మన దేశంతో స్నేహపూర్వకంగా ఉండేలా ముందుకు వస్తున్నాయి. అగ్రరాజ్య పాలకులు సైతం మన మోదీపై భుజంపై చేతులు వేసుకునే స్థాయికి భారత్ చేరింది.

గతంలో ఇందిరాగాంధీ అణు పరీక్షలు జరిపి దేశాన్ని ప్రపంచ దేశాల సరసన చేర్చింది. కానీ సంపన్న దేశాలు మన దేశంపై ఎన్నో ఆంక్షలు విధించాయి. ఇక ఆ తర్వాత  వాజ్ పేయి కూడా ఏ దేశానికి బెదరకుండా అణుపరీక్షలు సక్సెస్ ఫుల్ గా చేపట్టారు. దీనిపై అమెరికా వంటి పలు దేశాలు భారత్ పై ఆంక్షలు విధించాయి. అయినా వాజ్ పేయి సర్కార్ తలవంచలేదు. తన పనిని తాను సక్రమంగా చేసింది.

ఇక మోదీ వచ్చాక.. భారత్ ఇక సలాం కొట్టే దేశం కాదని..సవాల్ విసిరే దేశమని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. అన్ని దేశాలతో సఖ్యతగా ఉంటూనే.. తమ జోలికి వస్తే ఎంత పెద్ద దేశమైనా ఊరుకునేది లేదని చెప్పకనే చెప్పేది. ఇక మన పక్కన ఉంటూ మన దేశ వినాశనాన్ని కోరుకునే పాకిస్తాన్ కు సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉచ్చ పోయింది. కశ్మీర్ లో ఉగ్రతండాలను ఏరివేస్తోంది. దాదాపు దశాబ్ద కాలంగా టెర్రరిస్టుల దాడులు లేక దేశం ప్రశాంతంగానే ఉందని చెప్పాలి. మనపై దాడి చేయాలనే ఉద్దేశాన్నే పాకిస్తాన్ మరిచిపోయింది. ఆర్థికంగా కుదేలై, అంతర్గత సమస్యలతోనే తలమునకలైపోయింది.

ఇక చైనాకు గల్వాన్ సమాధానాలు చెపుతూనే ఉంది. ఏరంగంలో తీసుకున్నా చైనా కంటే భారత్ ఏమాత్రం తక్కువకాదు.. సై అంటే సై అన్నట్టుగా చైనాకు వణుకుపుట్టిస్తోంది. అలాగే ఖలీస్థాన్ ఉగ్రవాదులకు కెనడా ఆశ్రయం ఇస్తూ వారికి వంత పాడుతూ మన దేశాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై కూడా మోదీ సారథ్యంలోని భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ దేశ రాయబారులను వెనక్కి పంపించింది. ఖలీస్థానీ ఉగ్రవాదులను మద్దతు ఇస్తే చూస్తూ ఊరుకోమని ఆ దేశ పెద్దలకు తేల్చిచెప్పింది.

ఇక మొన్నటికి మొన్న మాల్దీవుల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన మొహమ్మద్ మొయిజు సర్కార్ భారత్ వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. మొయిజు చైనా అనుకూలవాది. భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మనపైకి తొడలు కొడుతున్న మాల్దీవ్స్ కు గట్టిగానే బుద్ధి చెప్పాలని మోదీ భావించారు. ఆ దేశ ప్రధాన ఆదాయ వనరు అయిన టూరిజంపైనే దెబ్బ కొట్టాలని భావించారు. మన దేశంలోని లక్షద్వీప్ లో ఆయన రీసెంట్ గా పర్యటించారు. ఇక్కడా ఎన్నో అందమైన బీచ్ లు, ప్రాంతాలు ఉన్నాయని దేశ టూరిస్టులు అందరూ లక్షద్వీప్ లో పర్యటించాలని పిలుపునిచ్చారు. దీంతో లక్షద్వీప్ కు ఎక్కడలేని ప్రాధాన్యం లభించింది. పలువురు ప్రముఖులు కూడా తాము లక్షద్వీప్ కు వెళ్తామని, మాల్దీవులకు వెళ్లమని ప్రకటనలు చేశారు.

దీంతో గాబరా పడిన మాల్దీవుల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు మోదీపై, భారత్ పై నానా కూతలు కూశారు. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం చేసింది. దేశంలో ‘బాయ్ కాట్ మాల్దీవ్స్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. దీంతో దెబ్బకు మాల్దీవ్స్ ట్రిప్స్ భారీగా పడిపోయాయి. ఫ్లైట్ టికెట్స్ డ్రాప్ అయిపోయాయి. ఇక ఆదేశానికి వణుకు మొదలైంది. తమ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని, అవి వారి వ్యక్తిగతమని, వారిని సస్పెండ్ చేశామని దిద్దుబాబు చర్యలు తీసుకుంటోంది. ఇక అక్కడి ప్రధాని చైనాకు వెళ్లి టూరిస్టులను పంపండి అని అడుక్కుంటున్నారు.

ఈ సంఘటనలే కాదు.. వివిధ దేశాలతో భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానంతో ఇప్పుడు ప్రపంచమంతా మన వైపే చూస్తోంది. శత్రు దేశాలు ముడుచుకుని కూర్చుంటుండగా.. అగ్రదేశాలు, తటస్థ దేశాలు మన స్నేహం కోసం చేయి చాస్తున్నాయి. అలాగే  పేద దేశాలు మనల్ని పెద్దన్న గా భావిస్తున్నాయి. మోదీ సమర్థ నాయకత్వంతో ప్రపంచ దేశాల్లో దేశ ప్రతిష్ఠ మరింతగా ఇనుమడిస్తోంది.

Exit mobile version