Rajinikanth : రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై పీఎం మోదీ ఆరా

Rajinikanth and Modi
Rajinikanth Health Condition : రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారు. అక్టోబర్ 1న రజనీ భార్య లతతో పీఎం ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఎక్స్ వేదికగా తెలిపారు. అంతకుముందు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, విశ్వనటుడు కమల్ హాసన్, మరో స్టార్ నటుడు విజయ్ ఎక్స్ వేదికగా సూపర్ స్టార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా లతా రజనీకాంత్ కు ఫోన్ చేసి మాట్లాడారు.
ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రి వర్గాల మెడికల్ బులెటిన్ ను విడుదల చేశాయి. ఆయన గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడిందని తెలిపాయి. దీనికి ట్రాన్స్ కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టంట్ అమర్చినట్టు వెల్లడించాయి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతారని తెలిపాయి.